News July 9, 2024
గ్రాట్యుటీ పొందడం ఉద్యోగి హక్కు: హైకోర్టు
TG: రిటైర్మెంట్ తర్వాత గ్రాట్యుటీ పొందడం ఉద్యోగి హక్కు అని హైకోర్టు స్పష్టం చేసింది. అది యాజమాన్యం ఔదార్యంతో ఇచ్చేది కాదని పేర్కొంది. ఉద్యోగి లేదా వారసులకు గ్రాట్యుటీ ఇవ్వాలని చట్టంలో ఉందని తేల్చి చెప్పింది. రూ.3.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెరిగిన గ్రాట్యుటీ సీలింగ్‌కు ఉద్యోగులు అర్హులంటూ PF అప్పిలేట్ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ECIL దాఖలు చేసిన అప్పీళ్లపై కోర్టు ఇలా స్పందించింది.
Similar News
News October 13, 2024
మరోసారి నిరాశపర్చిన అభిషేక్ శర్మ
టీమ్ ఇండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తీవ్రంగా నిరాశ పరిచారు. ఈ సిరీస్‌లో అభి వరుసగా 16, 15, 4 పరుగులే చేశారు. దీంతో అంచనాలకు తగ్గట్లుగా అతడు రాణించలేకపోవడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. అంతర్జాతీయ కెరీర్‌లో వచ్చిన ఛాన్స్‌లను ఆయన వృథా చేసుకుంటున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఇలాగే ఆడితే కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని అంటున్నారు. మరోసారి జట్టులో చోటు దక్కడం కష్టమని చెబుతున్నారు.
News October 13, 2024
అక్టోబర్ 13: చరిత్రలో ఈ రోజు
1679: పెను తుపానుతో మచిలీపట్నం ప్రాంతంలో 20 వేల మందికి పైగా మృతి
1965: హాస్య నటి కల్పనా రంజనీ జననం
1973: కవి, గీత రచయిత కందికొండ యాదగిరి జననం
1987: బాలీవుడ్ నటుడు కిషోర్ కుమార్ మరణం
1990: హీరోయిన్ పూజా హెగ్డే జననం
1993: టీమ్ ఇండియా క్రికెటర్ హనుమ విహారి జననం
ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం
News October 13, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.