News August 22, 2024
స్కూల్‌లో రక్షణ లేకపోతే విద్యాహక్కుకు అర్థం లేదు: హైకోర్టు
మహారాష్ట్రలోని బద్లాపుర్‌లో ఇద్దరు బాలికలపై లైంగికదాడి <<13897763>>ఘటనను<<>> ముంబై హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. పాఠశాలలో రక్షణ లేకపోతే విద్యాహక్కు చట్టం గురించి మాట్లాడటంలో అర్థమే లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదుచేయకపోవడంపై మండిపడింది. నేరం గురించి రిపోర్టు చేయనందుకు స్కూల్ యాజమాన్యాన్నీ విచారించేందుకు పోక్సో చట్టం అనుమతిస్తుందని పేర్కొంది.
Similar News
News September 19, 2024
అశ్విన్ హాఫ్ సెంచరీ
బంగ్లాదేశ్‌తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో లోకల్ బాయ్ అశ్విన్ అదరగొడుతున్నారు. టాప్ బ్యాటర్లు విఫలమైన పిచ్‌పై బ్యాటుతో రాణించి హాఫ్ సెంచరీ చేశారు. 58బంతుల్లో 50 రన్స్ చేశారు. 144/6 వద్ద బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్ బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. మరో ఎండ్‌లో జడేజా(34) ఉన్నారు. వీరిద్దరు 102 బంతుల్లో 89 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 233/6గా ఉంది.
News September 19, 2024
YSRను తిట్టినవారికే మంత్రి పదవులు ఇచ్చారు: బాలినేని
AP: తాను ఏ తప్పూ చేయకపోయినా మంత్రి పదవి నుంచి తీసేశారని వైసీపీ మాజీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కానీ వైఎస్ఆర్‌ను తిట్టినవారిని మాత్రం మంత్రి పదవుల్లో కొనసాగించారని ఆయన అన్నారు. ‘నేనెప్పుడూ వ్యక్తిగత అవసరాల కోసం జగన్‌ను కలవలేదు. ప్రజా సమస్యల కోసమే ఆయనను కలిశాను. జగన్ కోసం ఉప ఎన్నికలకు వెళ్లిన 17 మందిలో ఇప్పుడు ఒక్కరైనా ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నారా?’ అని ఆయన ప్రశ్నించారు.
News September 19, 2024
జానీ మాస్టర్ ఘటనపై స్పందించిన మనోజ్
జానీ మాస్టర్ కేసుపై హీరో మంచు మనోజ్ స్పందించారు. ‘ఈ స్థాయికి వచ్చేందుకు ఆయన ఎంతగా శ్రమించారో అందరికీ తెలుసు. ఆయనపై ఆరోపణలు చూస్తుంటే నా గుండె ముక్కలవుతోంది. తప్పు ఎవరిది అనేది చట్టం నిర్ణయిస్తుంది. ఒక మహిళ ఆరోపణలు చేసినప్పుడు పారిపోవడం భావి తరాలకు ప్రమాదకర మెసేజ్ ఇస్తోంది. త్వరగా స్పందించిన HYD పోలీసులకు అభినందనలు. మాస్టర్ తప్పు చేయకపోతే పోరాడండి. దోషి అయితే అంగీకరించండి’ అని మనోజ్ సూచించారు.