News August 29, 2024

RIL, డిస్నీ విలీనం: TV18, నెట్‌వర్క్18 షేర్ల దూకుడు

image

రిలయన్స్ ఇండస్ట్రీస్, డిస్నీ ఇండియా విలీనానికి సీసీఐ ఆమోదం తెలపడంతో టీవీ18, నెట్‌వర్క్18 షేర్లు దుమ్మురేపుతున్నాయి. ఇంట్రాడేలో ఒకానొక దశలో 13% మేర ఎగిశాయి. ప్రస్తుతం నెట్‌వర్క్18 షేర్లు 10% లాభంతో రూ.106 వద్ద కొనసాగుతున్నాయి. సగటు ట్రేడింగ్ వాల్యూమ్ 4 రెట్లు పెరిగింది. టీవీ18 బ్రాడ్‌కాస్ట్ షేర్లు 10.69% లాభంతో రూ.52.99 వద్ద చలిస్తున్నాయి. సగటు ట్రేడింగ్ వాల్యూమ్ 3 రెట్లు ఎగిసింది.

Similar News

News September 17, 2024

మద్యం రేట్లు పెంచడంతో గంజాయికి ఎడిక్ట్ అయ్యారు: మంత్రి కొల్లు

image

AP: తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందించేలా నూతన మద్యం పాలసీ రూపొందించామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. లిక్కర్ పాలసీపై క్యాబినెట్ సబ్‌కమిటీ మీటింగ్ తర్వాత మంత్రులు మాట్లాడారు. ‘గత ప్రభుత్వం మద్యం రేట్లు పెంచడంతో చాలామంది గంజాయికి ఎడిక్ట్ అయ్యారు. నాసిరకం మందుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు’ అని కొల్లు మండిపడ్డారు. కొత్తగా ప్రీమియం ఔట్‌లెట్స్ ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల వెల్లడించారు.

News September 17, 2024

కాంగ్రెస్ కూడా బ్రిటిష్ వాళ్లలానే: మోదీ

image

బ్రిటిష్ పాలకులకు, కాంగ్రెస్‌కు మధ్య పోలికలున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. భువనేశ్వర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘మన దేశ స్వాతంత్య్రంలో గణేశ్ ఉత్సవం ముఖ్యపాత్ర పోషించింది. విభజించి పాలించే బ్రిటిష్ వారు అప్పట్లో గణేశ్ ఉత్సవాలపై మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో గణేశ్ విగ్రహాన్ని కటకటాల వెనుక ఉంచారు. ఇది బాధించింది. ఇలాంటివి జరగనివ్వకూడదు’ అని అన్నారు.

News September 17, 2024

₹10వేల SIPతో ₹67 లక్షల ప్రాఫిట్

image

కెనరా రొబెకో కన్జూమర్ ట్రెండ్స్ ఫండ్ ఇన్వెస్టర్ల ఇంట సిరులు కురిపించింది. ఏటా 18.64% రిటర్న్ ఇచ్చింది. 2009, సెప్టెంబర్లో మొదలైన ఈ ఫండ్‌లో ప్రతి నెలా రూ.10వేలు సిప్ చేసిన వారికి ఇప్పుడు రూ.84.81 లక్షలు చేతికందాయి. అంటే 15 ఏళ్లలో విడతల వారీగా పెట్టిన రూ.18 లక్షలకు రూ.66.81 లక్షల లాభం వచ్చిందన్నమాట. పదేళ్ల క్రితం ఒకేసారి రూ.12 లక్షలు పెట్టుంటే రూ.34.52 లక్షలు అందేవి. కాంపౌండింగ్ పవర్ అంటే ఇదే.