News April 24, 2024

కోహ్లీని వదలని రింకూ

image

రింకూ సింగ్.. కోహ్లీని వదలట్లేదు. తనకు మరో బ్యాట్ ఇవ్వండంటూ అతడి వెంట పడుతున్నారు. మొన్న ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లీని కలిసిన రింకూ ‘మీరిచ్చిన బ్యాట్ విరిగింది. మరో బ్యాట్ ఇవ్వండి’ అంటూ బతిమిలాడిన వీడియో వైరలయింది. నిన్న మ్యాచ్ అనంతరం అతడు మళ్లీ కోహ్లీ వెంటే కనిపించారు. అతడితో పాటు ఆర్సీబీ డగౌట్‌లోనూ కూర్చున్నారు. ‘కోహ్లీ బ్యాట్ రింకూకు అచ్చొచ్చినట్లు ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News December 9, 2025

గ్లోబల్ సమ్మిట్లో ₹5,39,495 కోట్ల పెట్టుబడులు

image

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2 రోజుల సదస్సులో ఇప్పటివరకు రూ.5,39,495 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. మొదటి రోజు రూ.2,43,000 కోట్లు ఇన్వెస్ట్ చేసేలా వివిధ కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ఇక రెండో రోజైన మంగళవారం సాయంత్రం వరకు మరో రూ.2,96,495 కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. IT, POWER, TOURISM, FOREST తదితర విభాగాల్లో ఇవి వచ్చాయి.

News December 9, 2025

లారీల ‘బంద్’ తాత్కాలిక వాయిదా

image

AP: ఇవాళ అర్ధరాత్రి నుంచి <<18509425>>బంద్<<>> చేపట్టాలన్న నిర్ణయంపై లారీ ఓనర్స్ అసోసియేషన్ వెనక్కి తగ్గింది. సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. సమయం ఇవ్వాలని ప్రభుత్వం కోరడంతో సమ్మె వాయిదా పడింది. 4 రోజుల్లో ఫిట్‌నెస్ ఛార్జీలు రివైజ్ చేస్తామని రవాణాశాఖ కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 13-20 ఏళ్లు దాటిన వాహనాలకు ఫిట్‌నెస్ ఛార్జీలు పెంచడాన్ని లారీ యజమానులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

News December 9, 2025

టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

image

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఉ.9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పూర్తి షెడ్యూల్‌ను పైన ఫొటోలో చూడవచ్చు. అనుకున్నట్టే CBSE పరీక్షల తరహాలో ఎగ్జామ్స్ మధ్య గ్యాప్ ఇచ్చారు. ఒక్కో పరీక్షకు మధ్య 4-5 రోజుల సమయం ఉంది. విద్యార్థుల ప్రిపరేషన్‌కు ఇది ఉపయోగపడనుంది.