News December 3, 2024

ఛత్రపతి శివాజీగా రిషబ్.. పోస్టర్ విడుదల

image

కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్.. ఛత్రపతి శివాజీ మహారాజ్’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజైంది. సందీప్ సింగ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం శివాజీ జీవితంపై తెరకెక్కనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ సినిమా 2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, రిషబ్ ప్రస్తుతం ‘కాంతార-2’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

Similar News

News December 18, 2025

వైద్యం కోసం పేదలు ఆస్తులు అమ్ముకోవాలి: జగన్

image

AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేదలు వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవలసి వస్తుందని YCP చీఫ్ జగన్ చెప్పారు. కోటి సంతకాలను గవర్నర్‌కు సమర్పించి CBN స్కామ్‌ను వివరించామన్నారు. ‘స్కూళ్లు, ఆసుపత్రులను ప్రభుత్వం నడపకపోతే ఆ సేవలు పేదలకు భరించరానివి అవుతాయి. ₹8వేల CRతో 17 కాలేజీలను భూములు సేకరించి కట్టాం. 7 కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. మీకు చేతకాకపోతే మేం వచ్చాక పూర్తిచేస్తాం’ అని అన్నారు.

News December 18, 2025

రెచ్చగొట్టే కామెంట్లు చేస్తే NBW.. కర్ణాటక అసెంబ్లీ ఆమోదం

image

ద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలను నాన్ బెయిలబుల్ నేరాలుగా పరిగణించే బిల్లును కర్ణాటక అసెంబ్లీ నేడు ఆమోదించింది. కులం/మతం/వ్యక్తిని రెచ్చగొట్టే కామెంట్లకు 1-7ఏళ్ల జైలు, రూ.50వేల ఫైన్ విధిస్తామని బిల్లులో పేర్కొంది. రిపీట్ చేస్తే 2ఏళ్ల జైలు, రూ.లక్ష ఫైన్ వేస్తారు. నేర తీవ్రత ప్రకారం బాధితుడికి పరిహారమిచ్చే అవకాశమూ ఉంది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే బిల్లు తెచ్చిందని BJP విమర్శించింది.

News December 18, 2025

భారీ జీతంతో NCRTCలో ఉద్యోగాలు

image

నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(NCRTC) 5 పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. పోస్టును బట్టి BE, B.Tech, PG, మేనేజ్‌మెంట్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు JAN 16 వరకు అప్లై చేసుకోవచ్చు. Dy.GMకు పేస్కేల్ రూ.70వేలు-రూ.2లక్షలు, Asst.మేనేజర్‌కు రూ.50,000 -రూ.1,60,000 ఉంది. వెబ్‌సైట్: www.ncrtc.co.in