News December 3, 2024

ఛత్రపతి శివాజీగా రిషబ్.. పోస్టర్ విడుదల

image

కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్.. ఛత్రపతి శివాజీ మహారాజ్’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజైంది. సందీప్ సింగ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం శివాజీ జీవితంపై తెరకెక్కనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ సినిమా 2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, రిషబ్ ప్రస్తుతం ‘కాంతార-2’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

Similar News

News April 18, 2026

మహిళా రిజర్వేషన్లు.. సామాన్యులకు టికెట్ సాధ్యమా?

image

పార్లమెంటుతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే.. ఒకవేళ చట్టం అమల్లోకి వచ్చినా దీనివల్ల ఎక్కువగా లబ్ధి పొందేది ఇప్పుడున్న రాజకీయ నేతల కుటుంబసభ్యులు, బంధువులేనని పలువురు పెదవి విరుస్తున్నారు. వారి భార్యకో, కూతురికో, కోడలికే టికెట్ వస్తుందని, సాధారణ మహిళలకు టికెట్ దక్కడం చాలా కష్టమంటున్నారు. మీ COMMENT?

News April 18, 2026

సినిమా కథ రాసుకున్న రామ్.. డైరెక్టర్ కోసం వేట?

image

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ తర్వాత కొత్త ప్రాజెక్టు విషయంలో రామ్ పోతినేని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆ మూవీలో పాట రాసిన ఆయన ఈసారి ఓ కథను తన కోసం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఆ స్టోరీని ఫర్‌ఫెక్ట్‌గా తెరపై ఆవిష్కరించే డైరెక్టర్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. గతంలో లోగి విఘ్నేశ్‌తో ఓ సినిమా దాదాపు ఖాయమవగా అనివార్య కారణాలతో ఆగిపోయినట్లు టాలీవుడ్ టాక్. మరి రామ్ చెప్పిన కథను తీసే దర్శకుడెవరో?

News April 18, 2026

రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం.. ఏం చెప్పనున్నారు?

image

ప్రధాని మోదీ ఈరోజు రాత్రి 8.30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై మాట్లాడే అవకాశం ఉంది.