News August 27, 2024
రిషభ్ పంత్ గొప్ప మనసు

టీమ్ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్ గొప్ప మనసు చాటుకున్నారు. కాలేజీ ఫీజు కట్టలేకపోయిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థికి ఆర్థిక సాయం చేశారు. రూ.90వేలు ఫీజు చెల్లించి ఆ విద్యార్థికి అండగా నిలిచారు. సోషల్ మీడియాలో సాయం చేయాలని ఆ విద్యార్థి వేడుకోగా పంత్ స్పందించినట్లు తెలుస్తోంది. కాగా ఏడాదిన్నర తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పంత్ T20 WC విన్నింగ్ జట్టులో సభ్యుడు. టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్‌గానూ ఎంపికయ్యే అవకాశం ఉంది.
Similar News
News January 16, 2026
మొన్న SETBACK.. నిన్న COMEBACK

WPLలో UPW క్రికెటర్ హర్లీన్ డియోల్ బ్యాటుతో అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. మొన్న DCతో మ్యాచ్‌లో హర్లీన్(36 బంతుల్లో 47రన్స్) స్లోగా ఆడుతున్నారనే కారణంతో కోచ్ అభిషేక్ నాయర్ ఆమెను రిటైర్డ్ ఔట్‌గా ప్రకటించి మైదానం నుంచి బయటికి పిలిచారు. ఆ చర్యతో క్రికెట్ అనలిస్టులు సైతం ఆశ్చర్యపోయారు. కాగా తన ఈగో హర్ట్ అయ్యిందేమో అన్నట్లుగా నిన్న MIపై 64(39 బాల్స్) స్కోర్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు.
News January 16, 2026
173 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

NCERTలో 173 పోస్టులకు అప్లై చేయడానికి దరఖాస్తు గడువును పెంచారు. అర్హతగల వారు జనవరి 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్ , డిగ్రీ, డిప్లొమా( ప్రింటింగ్ టెక్నాలజీ, గ్రాఫిక్స్), ITI, B.Tech, M.Tech, PG, MBA, B.L.Sc, M.L.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. రాతపరీక్ష/CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ncert.nic.in
News January 16, 2026
282 పోస్టులు.. అప్లై చేశారా?

CSI ఈ గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ 282 ఆధార్ సూపర్ వైజర్/ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జిల్లా కేంద్రాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో ఏపీలో 4, తెలంగాణలో 11 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్+ITI, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cscspv.in


