News November 1, 2024

రిషబ్ శెట్టి హనుమాన్ పాత్రకు జీవం పోశారు: ప్రశాంత్

image

దీపావళి సందర్భంగా రిలీజైన ‘జై హనుమాన్’ పోస్టర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చిందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. జాతీయ అవార్డు గ్రహీత నటుడు రిషబ్ శెట్టి హనుమాన్ పాత్రకు జీవం పోశారంటూ ట్వీట్ చేశారు. ‘అద్భుతమైన పరివర్తన, ఖచ్చితమైన పరిపూర్ణత, మీ నిబద్ధత జై హనుమాన్‌ని అసాధారణమైనదిగా మార్చాయి. మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు, ఇంకా జై హనుమాన్ ప్రయాణాన్ని మీతో ప్రారంభించేందుకు ఎగ్జైట్‌గా ఉన్నా’ అని తెలిపారు.

Similar News

News December 5, 2024

ఏపీలో 53 నూతన జూనియర్ కాలేజీలకు గ్రీన్‌సిగ్నల్

image

AP: రాష్ట్రవ్యాప్తంగా 53 నూతన జూనియర్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా పంపిన ప్రతిపాదనలకు పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఆమోదం తెలిపారు. 37 మండలాల్లో 47, రెండు పట్టణ ప్రాంతాల్లో 6 కాలేజీలను ఏర్పాటుచేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 480 జూనియర్ కాలేజీలున్నాయి.

News December 5, 2024

‘మేకిన్ ఇండియా’పై పుతిన్ ప్రశంసలు

image

చిన్న, మధ్యతరహా కంపెనీలకు స్థిరమైన పరిస్థితులను భారత ప్రభుత్వం, అక్కడి నాయకత్వం సృష్టించిందని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. PM నరేంద్రమోదీ చేపట్టిన ‘మేకిన్ ఇండియా’ బాగుందని ప్రశంసించారు. ‘రష్యా ఇంపోర్ట్ సబ్‌స్టిట్యూషన్ ప్రోగ్రామ్‌లాగే మేకిన్ ఇండియా ఉంటుంది. భారత్‌లో తయారీ ప్లాంట్లను నెలకొల్పేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అక్కడ పెట్టుబడులు లాభయదాకమని మేం విశ్వసిస్తున్నాం’ అని అన్నారు.

News December 5, 2024

ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్‌జెండర్లు

image

TG: ట్రాఫిక్ అసిస్టెంట్లుగా 44 మంది ట్రాన్స్‌జెండర్లు ఎంపికయ్యారు. నిన్న హైదరాబాద్ గోషామహల్ మైదానంలో రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్ లాంటి ఈవెంట్స్ నిర్వహించగా 58 మందిలో 44 మంది పాస్ అయ్యారు. వీరికి త్వరలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అనంతరం సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ మానిటరింగ్‌తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ సేవలకు వినియోగించుకోనున్నారు. వీరికి ప్రత్యేక యూనిఫామ్, స్టైఫండ్ అందిస్తారు.