News August 31, 2024
ఎన్టీఆర్తో రిషబ్ శెట్టి.. ఫొటోస్ వైరల్
చేతికి గాయంతో ‘దేవర’ షూటింగ్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంగళూరుకు వెళ్లారు. అక్కడ ఎయిర్పోర్టులో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టితో కలిసి వెళ్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీరిద్దరూ కలిసి ఏదైనా మూవీ ప్లాన్ చేస్తున్నారా? లేదా అనుకోకుండా కలిశారా? అనే చర్చ మొదలైంది. ఇద్దరి కాంబోలో సినిమా పట్టాలెక్కితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News September 21, 2024
ప్రతి అంశంలో బీజేపీని టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్
BJPని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. మహారాష్ట్రలో బీజేపీ అవినీతి వల్లే శివాజీ విగ్రహం కూలిందని, గురుగ్రామ్లో బైకర్ మృతికి కారణమైన కారుపై BJP స్టిక్కర్ ఉండడం వల్లే ఆ డ్రైవర్కు ఒక్కరోజులోనే బెయిల్ వచ్చిందని విమర్శించింది. పుణేలో పేవ్మెంట్కు గుంతపడి ట్రక్కు ఇరుక్కోవడంతో కొత్త ఎక్స్ప్రెస్ వే ద్వారా సెకెన్లలో పాతాళానికి చేరుకోవచ్చంటూ BJPని టార్గెట్ చేస్తోంది.
News September 21, 2024
Learning English: Synonyms
✒ Important: Necessary, Vital
✒ Interesting: Bright, Intelligent
✒ Keep: Hold, Maintain, Sustain
✒ Kill: Slay, Execute, Assassinate
✒ Lazy: Indolent, Slothful, Idle
✒ Little: Dinky, Puny, Diminutive
✒ Look: Inspect, Survey, Study
✒ Love: Like, Admire, Esteem
✒ Make: Design, Fabricate
News September 21, 2024
తిరుమల లడ్డూ వివాదం.. కేరళ కాంగ్రెస్ సెటైరికల్ ట్వీట్
తిరుమల లడ్డూపై వివాదం కొనసాగుతున్న వేళ వేలాది ALT అకౌంట్లలో ఒకే తరహా ట్వీట్లు రావడంపై కేరళ కాంగ్రెస్ సెటైరికల్ ట్వీట్ చేసింది. ‘2-3 ఏళ్లుగా శ్రీవారి లడ్డూ రుచి చూడగానే మా అమ్మ అనారోగ్యం పాలయ్యేది. దాన్ని ఎక్కువగా తినొద్దని మాకు చెప్పేది. అందులో ఏదో తప్పుగా జరుగుతోందని ఇప్పుడు అర్థమైంది’ అంటూ ట్వీట్లు వచ్చాయి. దీంతో అందరికీ ఒకే అమ్మ ఉందా అనే అర్థంలో ‘వన్ నేషన్.. వన్ మామ్’ అని INC రాసుకొచ్చింది.