News November 26, 2024

రిషభ్.. నువ్వెప్పుడూ నా సోదరుడివే: జిందాల్

image

వేలంలో LSGకి వెళ్లిన రిషభ్ పంత్‌ను ఉద్దేశిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘పంత్. నువ్వెప్పుడూ నా సోదరుడివే. నీకోసం ఏం చేయాలో అంతా చేశాం. కుటుంబీకుడిలా ట్రీట్ చేశాం. నిన్ను వేరే జట్టుకు కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఎప్పటికీ నువ్వు డీసీ ఆటగాడివే. మళ్లీ ఎప్పుడైనా కలుస్తామేమో. డీసీతో ఆడినప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో నీ ఆటను ఆస్వాదిస్తాను’ అని పేర్కొన్నారు.

Similar News

News December 14, 2024

నేడు అరుదైన ఫీట్ అందుకోనున్న కోహ్లీ

image

విరాట్ కోహ్లీ నేడు ఆస్ట్రేలియాతో జరగనున్న 3వ టెస్టులో అరుదైన ఫీట్ అందుకోనున్నారు. వన్డే, టీ20, టెస్టు ఫార్మాట్లలో కలిపి ఆ జట్టుపై 100వ మ్యాచ్ ఆడనున్నారు. ఇప్పటి వరకు అతను ఆస్ట్రేలియాపై 49 వన్డేలు, 23 టీ20లు, 27 టెస్టులు ఆడి 5,326 రన్స్ చేశారు. వీటిలో 17 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోరు 186. కోహ్లీ కంటే ముందు ఆస్ట్రేలియాతో 100 మ్యాచుల ఆడిన జాబితాలో సచిన్(110M, 6,707రన్స్) ఉన్నారు.

News December 14, 2024

75 ల‌క్ష‌ల ఓట్లు ఎక్క‌డివి?: ప్రకాశ్ అంబేడ్క‌ర్‌

image

మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో అద‌న‌పు ఓట్ల‌పై ఎన్నిక‌ల సంఘం స్పందించ‌కపోవడాన్ని అంబేడ్క‌ర్ మ‌న‌వ‌డు ప్ర‌కాశ్ అంబేడ్క‌ర్ తప్పుబట్టారు. సాయంత్రం 6 త‌రువాత 75 ల‌క్ష‌ల ఓట్లు అద‌నంగా పోల‌వ్వ‌డంపై వివ‌రాలు కోర‌గా స్పందన లేదన్నారు. 288 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓటింగ్ వివ‌రాలను EC అంద‌జేయాల‌న్నారు. ప్ర‌తి స్థానంలో 6 గంటల తరువాత 26K ఓట్ల వ‌ర‌కు పోల‌య్యాయ‌నే EC వాద‌న సందేహాస్ప‌ద‌మ‌ని VBA కార్య‌క‌ర్త‌లు చెబుతున్నారు.

News December 14, 2024

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి

image

విద్యుత్ వ్యవస్థ ధ్వంసమే లక్ష్యంగా రాజధాని కీవ్‌తో సహా పలు ప్రాంతాలపై రష్యా భీకర దాడికి దిగినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. 93 క్రూయిజ్‌, క్షిపణులు, 200కు పైగా డ్రోన్లతో రష్యా దాడులు చేసిందన్నారు. అందులో 11 క్రూయిజ్‌, 81 క్షిపణులను నేల కూల్చినట్లు ఆయన ప్రకటించారు. తమ దేశంపై రష్యా దురాక్రమణ ప్రారంభమైన మూడేళ్ల తర్వాత విద్యుత్తు వ్యవస్థపై ఇదే అతిపెద్ద దాడి అని ఆయన వివరించారు.