News December 19, 2024
అద్భుతమైన ఫొటో కోసం ప్రాణాలకు తెగించి!

వన్యప్రాణుల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో గుర్తించలేం. అలాంటిది సింహాన్ని దగ్గర నుంచి ఫొటో తీయాలంటే సాహసమనే చెప్పాలి. పైన కనిపిస్తోన్న ఫొటోలో సింహానికి కోపమొస్తే ఎలా ఉంటుందో అద్భుతంగా చూపించారు. దీనిని ఫొటోగ్రాఫర్ అతిఫ్ సయీద్ 2015లో తీశారు. కారు నుంచి బయటకు దిగి ఫొటో తీస్తుండగా సింహం అతణ్ని గమనించింది. ఈ ఫొటో తీసిన వెంటనే సింహం అతనిపై దాడి చేసింది. కారు డోరు ఓపెన్ ఉండటంతో అతను బతికిపోయాడు.
Similar News
News November 22, 2025
అధికారి కొడుకు, కూలీ కొడుకు పోటీ పడేలా చేయలేం: సీజేఐ

SC, ST రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై తన తీర్పుకు కట్టుబడి ఉన్నానని CJI జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. సీఎస్ కొడుకును వ్యవసాయ కూలీ కొడుకుతో పోటీ పడేలా చేయలేమని అన్నారు. ‘ఆర్టికల్ 14 సమానత్వాన్ని నమ్ముతుంది. అంటే అందరినీ సమానంగా చూడాలని కాదు. వెనుకబడిన వారిని ప్రత్యేకంగా ట్రీట్ చేయాలి. సమానత్వ భావనంటే ఇదే’ అని చెప్పారు. తన చివరి వర్కింగ్ డే సందర్భంగా వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
News November 22, 2025
peace deal: ఉక్రెయిన్‌ను బెదిరించి ఒప్పిస్తున్న అమెరికా!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి 28 పాయింట్లతో కూడిన <<18346240>>పీస్ ప్లాన్<<>>ను అందజేసింది. అయితే దీన్ని అంగీకరించాలని ఉక్రెయిన్‌పై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. లేదంటే నిఘా సమాచారం, ఆయుధాల సరఫరాలను తగ్గిస్తామని బెదిరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వచ్చే గురువారం లోగా ఒప్పందంపై సంతకం చేయాలని చెప్పినట్లు తెలిపాయి.
News November 22, 2025
Photo: మెరిసిపోతున్న ఢిల్లీని చూశారా?

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన అద్భుత ఫొటోలను నాసా SMలో షేర్ చేసింది. ఢిల్లీ, టోక్యో, న్యూయార్క్, సింగపూర్ వంటి నగరాలు రాత్రి పూట వెలిగిపోతున్నాయి. ఇవి స్పేస్ నుంచి కనిపించే అత్యంత ప్రకాశవంతమైన అర్బన్ సెంటర్లు అని నాసా క్యాప్షన్ ఇచ్చింది. వాటిలో ఢిల్లీ వ్యూ మాత్రం కళ్లుచెదిరేలా ఉంది. సిటీని విభజిస్తున్న యమునా నది, విద్యుత్ దీపాల వెలుగుల్లో సీతాకోకచిలుకలా అందంగా కనిపిస్తోంది.


