News June 12, 2024

జమ్మూ కశ్మీర్ ఘటనపై రితికా పోస్ట్.. వైరల్

image

జమ్మూ కశ్మీర్ ఘటనపై టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే స్పందించారు. హిందూ భక్తులపై ఉగ్రవాదుల దాడి బాధాకరమని ఆమె ఓ పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల కూడా రితికా తన ఇన్‌స్టాలో పాలస్తీనాకు మద్దతుగా ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ అని రాసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. దీంతో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దేశంలోని సమస్యలపై ఎప్పుడైనా స్పందించారా అంటూ ట్రోల్స్ చేశారు.

Similar News

News January 13, 2025

కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు

image

TG: కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. దరఖాస్తులతోపాటు కులగణన సర్వే ఆధారంగా రూపొందించిన జాబితా క్షేత్రస్థాయి పరిశీలన బాధ్యతలను కలెక్టర్లు, GHMC కమిషనర్‌కు అప్పగించింది. MPDOలు, మున్సిపల్ కమిషనర్లు ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డుల్లో ప్రదర్శించి చర్చించిన తర్వాతే ఆమోదిస్తారు. కార్డుల్లో మార్పులకూ అవకాశం కల్పిస్తారు. ఈ నెల 26 నుంచి కొత్త కార్డులను జారీ చేస్తారు.

News January 13, 2025

సంక్రాంతి వేడుకల ఫొటోలను పంచుకున్న మోదీ

image

ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ఫొటోలను ప్రధాని మోదీ ట్విటర్‌లో పంచుకున్నారు. దేశవ్యాప్తంగా సంక్రాంతి, పొంగల్‌ను ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారని చెప్పారు. ఈ పండగ భారతీయ వ్యవసాయ సంస్కృతిని ప్రతిబింబిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ శుభ సందర్భంగా ప్రజలు ఆనందంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు.

News January 13, 2025

GOOD NEWS: పీఎం కిసాన్ రూ.10,000లకు పెంపు?

image

పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు కేంద్రం ఏటా రూ.6,000 ఇస్తుండగా రూ.10,000లకు పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈ మేరకు ప్రకటన ఉంటుందని సమాచారం. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ పెంపుపై మాట్లాడిన విషయం తెలిసిందే. కేంద్రం ఇచ్చే రూ.10వేలతో పాటు తాము మరో రూ.10వేలు కలిపి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని చెప్పారు.