News June 12, 2024
జమ్మూ కశ్మీర్ ఘటనపై రితికా పోస్ట్.. వైరల్

జమ్మూ కశ్మీర్ ఘటనపై టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే స్పందించారు. హిందూ భక్తులపై ఉగ్రవాదుల దాడి బాధాకరమని ఆమె ఓ పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల కూడా రితికా తన ఇన్‌స్టాలో పాలస్తీనాకు మద్దతుగా ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ అని రాసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. దీంతో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దేశంలోని సమస్యలపై ఎప్పుడైనా స్పందించారా అంటూ ట్రోల్స్ చేశారు.
Similar News
News March 26, 2025
బాత్రూమ్‌లో ఎంతసేపు ఉంటున్నారు?

కొందరు అరగంట సేపైనా బాత్రూమ్‌లోనే ఉండిపోతూ కాలక్షేపం చేస్తుంటారు. టాయిలెట్ కమోడ్‌పై కూర్చొని రీల్స్ చూస్తుంటారు. ఇలా ఎక్కువ సేపు ఒకేచోట కూర్చోవడంతో పాయువు దగ్గర కండరాలపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల మలబద్ధకం, ఇన్ఫెక్షన్లు రావొచ్చని వైద్యులు చెబుతున్నారు. టాయిలెట్‌లో ఎక్కువ సేపు ఫోన్ చూడటంతో మెడ, వెన్ను నొప్పి, తిమ్మిర్లు వస్తాయి. అందుకే వెళ్లిన పనిని త్వరగా కానిచ్చి బయటపడాలంటున్నారు.
News March 26, 2025
కరిగిపోతున్న మంచు.. పెను ప్రమాదంలో చైనా?

చైనా మంచినీటి వనరులైన హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. 1960 నుంచి సుమారు 7వేలకు పైగా(సుమారు 26శాతం) మంచుదిబ్బలు మాయమైపోయాయని అంచనా. దీంతో తాగునీటి విషయంలో పెను సమస్యలు తప్పవని చైనా పర్యావరణవేత్తలు ఆందోళనగా ఉన్నారు. టిబెట్, షింజియాంగ్ ప్రావిన్సుల్లో అత్యధికంగా హిమానీనదాలున్నాయి. వాటిని కాపాడేందుకు చైనా పలు మార్గాల్ని అన్వేషిస్తున్నా ఫలితం దక్కడం లేదు.
News March 26, 2025
కోహ్లీ గొప్ప రోల్ మోడల్: నవజ్యోత్

విరాట్ కోహ్లీ ఒక ఇన్‌స్టిట్యూషన్ లాంటివారని, ఆయన పేరు కొన్ని తరాలు నిలిచి ఉంటుందని మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కొనియాడారు. ‘స్టార్ స్పోర్ట్స్’ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయనొక గొప్ప రోల్ మోడల్ అని, వీధుల్లోని పిల్లలు అతనిలా ఉండాలని కోరుకుంటారని పేర్కొన్నారు. యువతపై అతని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. తన చరిష్మాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు.