News March 11, 2025
మణిపుర్‌లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు జవాన్ల వీరమరణం

మణిపుర్‌లో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కు లోయలో పడటంతో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. మరో 13మంది గాయాలపాలయ్యారు. సేనాపతి జిల్లాలోని చాంగౌబంగ్ గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లా మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు.
Similar News
News March 12, 2025
Stock Markets: బ్యాంకు షేర్లకు గిరాకీ

స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 22,470 (-28), సెన్సెక్స్ 74,045 (-62) వద్ద చలిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. చమురు, ఎనర్జీ, PSE, PVT బ్యాంకు, కమోడిటీస్, ఫైనాన్స్, ఆటో, ఇన్ఫ్రా, మెటల్ షేర్లకు గిరాకీ పెరిగింది. ఐటీ, FMCG, హెల్త్‌కేర్, ఫార్మా, మీడియా షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. ఇండస్ఇండ్, టాటా మోటార్స్, BPCL, కొటక్, HDFC బ్యాంకు టాప్ గెయినర్స్.
News March 12, 2025
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్?

హోలీ పండగకు ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఎన్డీఏ సర్కార్ శుభవార్త చెప్పనుంది. ఇవాళ జరిగే క్యాబినెట్ సమావేశంలో DA(డియర్‌నెస్ అలవెన్స్), DR(డియర్‌నెస్ రిలీఫ్)పై ప్రకటన జారీ చేసే అవకాశముంది. ఇదే జరిగితే 1.2 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది. కాగా గత ఏడాది జులైలో DAను 50% నుంచి 53శాతానికి కేంద్రం పెంచింది. ఈ సారి 2శాతం పెరుగుతుందని అంచనా.
News March 12, 2025
ఆమె అరెస్ట్ నిర్బంధ పాలనకు పరాకాష్ఠ: KTR

TG: మహిళా జర్నలిస్ట్ రేవతిని అక్రమంగా అరెస్ట్ చేయడం రాష్ట్రంలో కొనసాగుతున్న ఎమర్జెన్సీ తరహా పాలనకు నిదర్శనమని మాజీ మంత్రి KTR విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఓ రైతు కష్టాల వీడియోను పోస్ట్ చేస్తే అరెస్ట్ చేయడం నిర్బంధ పాలనకు పరాకాష్ఠ అని మండిపడ్డారు. ప్రజాపాలనలో మీడియాకు స్వేచ్ఛ లేదని, రాహుల్ గాంధీ చెబుతున్న రాజ్యాంగబద్ధమైన పాలన ఇదేనా అని ప్రశ్నించారు. రేవతి అరెస్ట్‌ను హరీశ్ రావు కూడా ఖండించారు.