News March 11, 2025
మణిపుర్‌లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు జవాన్ల వీరమరణం

మణిపుర్‌లో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కు లోయలో పడటంతో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. మరో 13మంది గాయాలపాలయ్యారు. సేనాపతి జిల్లాలోని చాంగౌబంగ్ గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లా మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు.
Similar News
News March 22, 2025
శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 64,170 మంది భక్తులు దర్శించుకోగా 26,821 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.98 కోట్లు సమకూరింది.
News March 22, 2025
IPL: రేపు హైదరాబాద్‌లో మ్యాచ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రెండో మ్యాచ్ రేపు HYD ఉప్పల్ వేదికగా జరగనుంది. హోం టీమ్ సన్‌రైజర్స్.. రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది. ఆదివారం మ.3.30 గంటల నుంచి క్రీడాభిమానులను అలరించేందుకు ఇరు జట్లూ సిద్ధమయ్యాయి. మ్యాచ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2700 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. 450 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. 19 చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించినట్లు చెప్పారు.
News March 22, 2025
BIG BREAKING: మళ్లీ విజృంభించిన బర్డ్ ఫ్లూ..

TG: కొన్ని వారాలుగా తగ్గుముఖం పట్టిన బర్డ్ ఫ్లూ మళ్లీ కోరలుచాస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా గుండ్రాంపల్లి, భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం ప్రాంతాల్లో ఈ మహమ్మారిని అధికారులు గుర్తించారు. నివారణ చర్యల్లో భాగంగా బయోసేఫ్టీ సిబ్బంది 2 లక్షల కోళ్లను తొలగించారు. అధికారులు పరిసరాలను రెడ్ జోన్‌గా ప్రకటించారు. కోళ్ల ఫుడ్, వ్యర్థాలు సహా అన్నింటినీ క్లియర్ చేస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు.