News October 5, 2025

ఈ 6 గంటల్లోనే రోడ్డు ప్రమాదాలెక్కువ!

image

TG: రాష్ట్రంలో 2023లో జరిగిన రోడ్డు ప్రమాదాల వివరాలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజాగా వెల్లడించింది. 22,903 యాక్సిడెంట్లలో 7,660 మంది చనిపోయారని పేర్కొంది. ఏటా నమోదవుతున్న రోడ్డు ప్రమాదంలో 75% మ.3 నుంచి రా.9 గంటల మధ్యే జరుగుతున్నాయని తెలిపింది. డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, నిర్లక్ష్యం ఈ ప్రమాదాలకు కారణాలుగా పేర్కొంది. 2023లో ఈ 6 గంటల వ్యవధిలో మొత్తం 8,775 యాక్సిడెంట్లు జరిగాయి.

Similar News

News October 5, 2025

ECGCలో 25 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECGC) 25 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇవాళే (OCT 5) ఆఖరు తేదీ. వయసు 21 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి సడలింపు ఉంది. అభ్యర్థులు ముందుగా www.nats.education.gov.in పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్‌సైట్: https://main.ecgc.in/

News October 5, 2025

ఇతిహాసాలు క్విజ్ – 26

image

1. రాముడు ఏ వంశానికి చెందినవాడు?
2. ఉత్తర, అభిమన్యుల కుమారుడు ఎవరు?
3. విష్ణువు కాపలదారులు ఎవరు?
4. కార్తికేయ స్వామికి ఎన్ని తలలుంటాయి?
5. హనుమాన్ చాలీసా రచయిత ఎవరు?
– సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#IthihasaluQuiz<<>>

News October 5, 2025

ALERT.. భారీ వర్షాలు

image

TGలో రాబోయే 24 గంటల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ADB, ఆసిఫాబాద్, BHPL, PDPL, HNK, జనగామ, SDPT, MHBD, సూర్యాపేట, ఖమ్మం, WGL, భద్రాద్రి, మెదక్, ములుగు, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు APలోని శ్రీకాకుళం, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, TPT జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వానలు కురుస్తాయని APSDMA వెల్లడించింది.