News August 29, 2024
రూ.50లక్షలు ఇస్తూ దొరికిన దొంగ రేవంత్: హరీశ్ రావు

TG: సీఎం రేవంత్పై BRS MLA హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మొన్న చేసింది చిట్ చాట్ కాదని.. చీట్ చాట్ అని ఎద్దేవా చేశారు. పట్టపగలే రూ.50లక్షలు ఇస్తూ దొరికిన దొంగ రేవంత్ అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. రుణమాఫీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్న హరీశ్.. రేవంత్ స్వగ్రామంలో రుణమాఫీ అయ్యిందో లేదో తెలుసుకునేందుకు రాహుల్ గాంధీని తీసుకెళ్తా అన్నారు.
Similar News
News January 8, 2026
వేదాంత గ్రూప్ ఛైర్మన్ కుమారుడు గుండెపోటుతో మృతి

వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కుమారుడు అగ్నివేశ్ (49) గుండెపోటుతో మృతి చెందారు. అమెరికాలో జరిగిన స్కీయింగ్ ప్రమాదం తర్వాత హాస్పిటల్లో కోలుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా అనిల్ అగర్వాల్ వెల్లడించారు. “ఈ రోజు నా జీవితంలో అత్యంత చీకటి రోజు” అని అన్నారు. తన కొడుకు ఎప్పుడూ ప్రశాంతంగా, అందరితో స్నేహపూర్వకంగా ఉండేవారని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
News January 8, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 8, గురువారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.23 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.21 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.57 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.14 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.