News August 29, 2024
రూ.50లక్షలు ఇస్తూ దొరికిన దొంగ రేవంత్: హరీశ్ రావు
TG: సీఎం రేవంత్‌పై BRS MLA హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మొన్న చేసింది చిట్ చాట్ కాదని.. చీట్ చాట్ అని ఎద్దేవా చేశారు. పట్టపగలే రూ.50లక్షలు ఇస్తూ దొరికిన దొంగ రేవంత్ అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. రుణమాఫీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్న హరీశ్.. రేవంత్ స్వగ్రామంలో రుణమాఫీ అయ్యిందో లేదో తెలుసుకునేందుకు రాహుల్ గాంధీని తీసుకెళ్తా అన్నారు.
Similar News
News September 19, 2024
కొత్త బుల్లెట్ వేరియెంట్ తీసుకొచ్చిన ఎన్‌ఫీల్డ్
బెటాలియన్ బ్లాక్ పేరిట రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌లో కొత్త వేరియెంట్‌ను తీసుకొచ్చింది. గోల్డ్ పిన్ స్ట్రైపింగ్, బెంచ్ సీట్, పెద్ద సైజు నేమ్ బ్యాడ్జిలతో వింటేజ్ బుల్లెట్‌ను గుర్తుచేసేలా దీన్ని డిజైన్ చేసింది. 349సీసీ సింగిల్ సిలిండర్, 5 స్పీడ్ గేర్ బాక్స్, ముందు 300 ఎంఎం ఫ్రంట్ డిస్క్, వెనుక వైపు 153 ఎంఎం డ్రమ్ బ్రేక్, సింగిల్ ఛానల్ ఏబీఎస్ అందిస్తోంది. ధర రూ.1.75 లక్షలు(ఢిల్లీ ఎక్స్ షోరూమ్).
News September 19, 2024
WOW.. 147 ఏళ్లలో తొలిసారి
బంగ్లాదేశ్‌తో టెస్టులో హాఫ్ సెంచరీ చేసిన భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అరుదైన ఘనత సాధించారు. కెరీర్‌లో తొలి 10 ఇన్నింగ్సుల్లోనే(స్వదేశంలో) 750కు పైగా రన్స్ చేసిన క్రికెటర్‌గా నిలిచారు. వెస్టిండీస్ ఆటగాడు జార్జ్ హీడ్లీ 1935లో 747 రన్స్ చేయగా తాజాగా జైస్వాల్ ఆ రికార్డును బద్దలుకొట్టారు. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక రన్స్ చేసిన తొలి ఆటగాడిగా అవతరించారు.
News September 19, 2024
శుభ్‌మన్ గిల్ చెత్త రికార్డు
టీమ్ ఇండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్ చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు డకౌటైన ఆరో భారత ఆటగాడిగా గిల్ నిలిచారు. బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టులో గిల్ డకౌటైన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో మొహిందర్ అమర్‌నాథ్ (5) అగ్రస్థానంలో ఉన్నారు. విరాట్ కోహ్లీ, అలీఖాన్ పటౌడీ, దిలీప్ వెంగ్‌సర్కార్, వినోద్ కాంబ్లీ కూడా మూడేసి సార్లు డకౌట్ అయ్యారు.