News May 24, 2024
అభిమానులతో సరదాగా గడిపిన రోహిత్

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తన అభిమానులతో ఆయన సరదాగా గడుపుతున్నారు. వారితో సెల్ఫీలు దిగుతూ కనిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా టీ20 వరల్డ్ కప్ కోసం రేపు రోహిత్ అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆయనతోపాటు మరికొందరు ఆటగాళ్లు కూడా యూఎస్ విమానం ఎక్కనున్నట్లు సమాచారం.
Similar News
News January 5, 2026
వరిలో కాండం తొలిచే పురుగు నివారణ ఎలా?

వరి నారుమడి దశలో కాండం తొలిచే పురుగును గుర్తిస్తే నారుమడిలో కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు లేదా 600 గ్రా. ఫిప్రోనిల్ 0.3జి గుళికలు వేయాలి. ఒకవేళ నారుమడిలో వేయకపోతే 15 రోజుల వయసున్న, పిలకదశలో ఉన్న వరిపైరులో తప్పకుండా ఎకరాకు కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు 10KGలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 8KGలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4G గుళికలు 4kgలను 20-25 కిలోల ఇసుకలో కలిపి బురద పదునులో వేయాలి.
News January 5, 2026
AIIMS రాయ్‌పుర్‌లో 115పోస్టులు… అప్లై చేశారా?

<
News January 5, 2026
శివుడిని మనసారా పూజిస్తే ఎన్ని లాభాలో..

బాహ్య పూజలో ఏకాగ్రత దెబ్బతినే అవకాశాలుంటాయి. కానీ మానస పూజలో మనసు పూర్తిగా దైవంపైనే లీనమవుతుంది. మనసులోని అశాంతిని పోగొట్టి, ఏకాగ్రతను పెంచుకోవడానికి శివ మానస పూజ ఉత్తమ మార్గం. అహంకారాన్ని తొలగించి ‘నేనే దైవం’ అనే జ్ఞానాన్ని పొందేందుకు ఈ పూజ చేస్తారు. ప్రయాణాల్లో ఉన్నవారు కూడా శివుడిని సదా స్మరించడానికి ఈ విధానం తోడ్పడుతుంది. కోటి బాహ్య పూజల కంటే ఒక మానస పూజ శ్రేష్ఠమని పెద్దలు చెబుతారు.


