News October 11, 2024
IPL వేలంలో రోహిత్? హర్భజన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐపీఎల్లో వచ్చే సీజన్లో రోహిత్ శర్మ ముంబై జట్టును వీడుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ రోహిత్ గనుక వేలంలో పాల్గొంటే మరింత ఆసక్తికరంగా మారనుందని చెప్పారు. అతడిని దక్కించుకునేందుకు ఏ జట్టు అత్యధికంగా బిడ్ వేస్తుందో చూడాలని ఉందన్నారు. రోహిత్లో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని, ఆయన భారీ ధర పలకడం ఖాయమని జోస్యం చెప్పారు.
Similar News
News November 29, 2025
భద్రాద్రి జిల్లాలో రెండో రోజు 116 సర్పంచ్ నామినేషన్లు

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా రెండో రోజు శుక్రవారం 116 మంది సర్పంచ్ అభ్యర్థిత్వం కోసం నామినేషన్లు దాఖలు చేశారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. మొదటి విడతలో 159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. 1436 వార్డులకు గాను 370 మంది వార్డు సభ్యులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.
News November 29, 2025
సివిల్స్ ప్రిపరేషన్.. నార్నూర్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్

నార్నూర్ గ్రామ పంచాయతీ రాజకీయాల్లో నూతన ఒరవడి ప్రారంభమైంది. అగ్రికల్చర్ డిగ్రీ పూర్తి చేసి, సివిల్స్ కోసం సిద్ధమవుతున్న ఉన్నత విద్యావంతురాలు బాణోత్ కావేరి సర్పంచ్ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. పుట్టిన గడ్డకు సేవ చేయాలనే లక్ష్యంతో ఆమె బరిలో దిగుతున్నారు. మాజీ సర్పంచ్ బాణోత్ గజానంద్ నాయక్ కుమార్తె అయిన కావేరి, గ్రామస్థులతో కలిసి నామినేషన్ పత్రాలను సమర్పించారు.
News November 29, 2025
ధాన్యం కొనుగోలుకు కంట్రోల్ రూమ్: జేసీ

పశ్చిమగోదావరి జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కంట్రోల్ రూమ్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే 8121676653, 18004251291 నంబర్లలో సంప్రదించాలని కోరారు. రానున్న రెండు, మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.


