News October 11, 2024

IPL వేలంలో రోహిత్? హర్భజన్ ఆసక్తికర వ్యాఖ్యలు

image

ఐపీఎల్‌లో వచ్చే సీజన్‌లో రోహిత్ శర్మ ముంబై జట్టును వీడుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ రోహిత్ గనుక వేలంలో పాల్గొంటే మరింత ఆసక్తికరంగా మారనుందని చెప్పారు. అతడిని దక్కించుకునేందుకు ఏ జట్టు అత్యధికంగా బిడ్ వేస్తుందో చూడాలని ఉందన్నారు. రోహిత్‌లో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని, ఆయన భారీ ధర పలకడం ఖాయమని జోస్యం చెప్పారు.

Similar News

News July 10, 2025

మోదీ, జగన్ మధ్య అక్రమ పొత్తు: YS షర్మిల

image

AP: మోదీకి జగన్ దత్తపుత్రుడు అని, వారి మధ్య అక్రమ పొత్తు ఉందని షర్మిల ఆరోపించారు. ‘మోదీ మద్దతుతో జగన్ ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది. తలకాయల మీద కార్లు పోనిచ్చినా, మామిడి కాయలు తొక్కుకుంటూ వెళ్లినా, రప్పా రప్పా నరుకుతామని హెచ్చరించినా చీమంత చర్య కూడా ఉండదు’ అని ట్వీట్ చేశారు. జగన్ పర్యటనకు పైకి 500 మందితో అనుమతి ఇస్తారు కానీ 10వేల మందితో వచ్చినా కూటమి ప్రభుత్వం సహకరిస్తుందని ఆమె విమర్శించారు.

News July 10, 2025

టాస్ ఓడిన భారత్.. జట్టులోకి బుమ్రా

image

లార్డ్స్‌ వేదికగా టీమ్ ఇండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమ్ ఇండియాలో ప్రసిద్ధ్ స్థానంలో బుమ్రా జట్టులోకి వచ్చారు. IND(XI): జైస్వాల్, రాహుల్, నాయర్, గిల్, పంత్(Wk), జడేజా, సుందర్, ఆకాశ్ దీప్, సిరాజ్, బుమ్రా, నితీశ్. ENG(XI): క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్, స్మిత్(Wk), వోక్స్, కార్స్, ఆర్చర్, బషీర్.

News July 10, 2025

గాల్లో ఢీకొన్న విమానాలు.. ఇద్దరి మృతి

image

కెనడాలో విమానాలు ఢీకొన్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రెండు శిక్షణ విమానాలు గాల్లో ఢీకొనగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో భారత సంతతికి చెందిన శ్రీహరి సుకేశ్ (21)తో పాటు మరో వ్యక్తి మృతి చెందారు. సుకేశ్ కేరళ వాసిగా తెలుస్తోంది. ఈ ప్రమాదంపై కాన్సులేట్ జనరల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సుకేశ్ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేసింది.