News November 15, 2024
రోహిత్ పారిపోయే కెప్టెన్ కాదు: కైఫ్

టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ సవాళ్ల నుంచి పారిపోయే కెప్టెన్ కాదని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ వ్యాఖ్యానించారు. వీలుంటే వెంటనే టెస్టు జట్టుతో చేరేవారని పేర్కొన్నారు. ‘రోహిత్ ఓ నాయకుడు. ఆయనలో పారిపోయే నైజం లేదు. తొలి టెస్టు నుంచే ఆడాలని ఆయన కచ్చితంగా అనుకుంటూ ఉంటారు. అందుకే గైర్హాజరీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇంట్లో పరిస్థితి ఓకే అనుకుంటే వెంటనే పెర్త్కు వచ్చేస్తారు’ అని తెలిపారు.
Similar News
News December 15, 2025
దురదృష్టం.. ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ చేసినా

TG: సూర్యాపేటలోని గుడిబండ గ్రామంలో ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన వెంకటేశ్వర్లుకు దురదృష్టం వెంటాడింది. కేవలం పది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మంత్రి ఉత్తమ్, ఆయన సతీమణి పద్మావతి వ్యక్తిగతంగా మద్దతు తెలిపినా వెంకటేశ్వర్లుకు పరాజయం తప్పలేదు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నాగయ్య చేతిలో ఓడారు. వెంకటేశ్వర్లు పదవీకాలం మరో 5 నెలల్లో ముగియనుండగా VRS తీసుకొని పోటీ చేశారు.
News December 15, 2025
చిరంజీవికి ఆ లుక్ వద్దని చెప్పా: అనిల్ రావిపూడి

‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా కోసం చిరంజీవి ‘సాల్ట్ అండ్ పెప్పర్’ లుక్ ప్రయత్నిస్తానన్నారని, తానే వద్దని చెప్పినట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. బయట ఎలా ఉన్నారో సినిమాలో అలానే చూపిస్తానని చెప్పానని అనిల్ అన్నారు. కాగా ఈ మూవీలో వెంకీ-చిరు కాంబినేషన్లో 20 నిమిషాల సీన్స్ ఉంటాయని చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుండగా, ఇప్పటికే వెంకీ రోల్ షూటింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే.
News December 15, 2025
డిసెంబర్ 15: చరిత్రలో ఈరోజు

✪ 1933: సినీ దర్శకుడు బాపు జననం
✪ 1950: భారత తొలి ఉపప్రధాని సర్దార్ వల్లభాయి పటేల్ మరణం (ఫొటోలో)
✪ 1952: ప్రత్యేకాంధ్ర పోరాటయోధుడు పొట్టి శ్రీరాములు మరణం
✪ 1973: మూవీ డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా జననం
✪ 1990: హీరోయిన్ లావణ్య త్రిపాఠి జననం
✪ 2014: సంగీత దర్శకుడు చక్రి మరణం


