News September 21, 2024
వెయ్యి రన్స్ కొట్టిన ఓల్డెస్ట్ కెప్టెన్‌గా రోహిత్
కెప్టెన్ రోహిత్‌శర్మ బంగ్లాదేశ్‌తో టెస్టులో(5, 6రన్స్) రాణించలేకపోయినా ఒక రికార్డు నమోదు చేశారు. ఓ క్యాలెండర్ ఇయర్‌లో వెయ్యికిపైగా రన్స్ చేసిన ఓల్డెస్ట్ భారత కెప్టెన్‌గా నిలిచారు. 37Y రోహిత్ 2024లో 3 వన్డేలు(157), 11 T20లు(378), 7 టెస్టుల్లో(466) మొత్తం 1,001 రన్స్ చేశారు. ఈ ఏడాది టాప్ స్కోరర్లుగా శ్రీలంక క్రికెటర్లు నిస్సాంక, కుశాల్ మెండిస్, 3లో జైస్వాల్, 4లో కమిందు మెండిస్, 5లో రోహిత్ ఉన్నారు.
Similar News
News October 5, 2024
వాళ్లకు మాత్రమే రుణమాఫీ జరగలేదు: CM రేవంత్
TG: రూ.2లక్షలలోపు పంట రుణం తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ అన్నారు. రూ.2లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్నవారు, ఆ పై మొత్తాన్ని చెల్లిస్తే మాఫీ చేస్తామని తెలిపారు. రుణమాఫీ కాని రైతులు రోడ్లు ఎక్కడానికి బదులుగా ఆయా జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాలని సీఎం సూచించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మితే ‘మన్నుపోసి అంబలి కాసిన’ పరిస్థితి వస్తుందని రేవంత్ అన్నారు.
News October 5, 2024
పేదలను ఎలా ఆదుకోవాలో సలహా ఇవ్వండి: CM
TG: మూసీ నిర్వాసితులను ఏ విధంగా ఆదుకోవాలో సలహాలు ఇవ్వాలని సీఎం రేవంత్ కోరారు. పేదలకు అన్యాయం చేయబోమని, రివర్ బెడ్, బఫర్ జోన్‌లో ఉన్న వాళ్లకు ప్రత్యామ్నాయం చూపిస్తామని స్పష్టం చేశారు. మూసీ విషయంలో రెచ్చగొట్టే వారి మాటలను ప్రజలు నమ్మవద్దని కోరారు. పేదల మంచి కోసమే తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. పేదలకు న్యాయం చేసేందుకు BRS, BJPలు సూచనలు చేయాలని కోరారు.
News October 5, 2024
రేవంత్ CM కుర్చీ కాపాడుకునే పనిలో ఉన్నారు: KTR
TG: రేవంత్‌రెడ్డి CM కుర్చీ కాపాడుకునే పనిలో ఉన్నారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆరోపించారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అక్టోబర్ వచ్చినా మాఫీ చేయలేదన్నారు. రేవంత్ బోగస్ మాటలు చెప్పి రైతులను మోసం చేశారని కేటీఆర్ దుయ్యబట్టారు. సీఎం మనుషులనే కాదు దేవుళ్లను కూడా మోసం చేశారని ధ్వజమెత్తారు.