News April 5, 2024

హార్దిక్ కెప్టెన్సీలో ఆడటం రోహిత్‌కు ఇష్టమే: శ్రీశాంత్

image

ముంబై జట్టును రోహిత్ శర్మ గతంలో ముందుండి నడిపించారని, ఇప్పుడు వెనకాల ఉండి నడిపిస్తారని భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ అన్నారు. ‘మార్పును అంగీకరించేందుకు మనం సిద్ధంగా ఉండాలి. హార్దిక్ కెప్టెన్సీలో ఆడేందుకు రోహిత్ ఇష్టపడతారు. గతంలో ధోనీ కెప్టెన్సీలో సచిన్ కూడా ఆడారు. ఆ సమయంలో వరల్డ్ కప్ కూడా గెలిచారు. కెప్టెన్సీ లేకపోవడంతో రోహిత్ స్వేచ్ఛగా ఆడి ఆరెంజ్ క్యాప్ రేసులో ఉంటారు’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

Similar News

News January 16, 2025

Q3లో రిలయన్స్, జియో ఆదాయాలు ఇలా..

image

2024-25 Q3లో 7 శాతం వృద్ధితో రూ.18,540 కోట్ల నికర ఆదాయం వచ్చినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ.2.43 లక్షల కోట్లకు చేరినట్లు తెలిపింది. ఇక డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి జియో ఆదాయం రూ.6,681 కోట్లుగా నమోదైనట్లు పేర్కొంది. 2023 డిసెంబర్ నాటికి రూ.5,447 కోట్లు ఉండగా ఈసారి 26 శాతం పెరిగినట్లు వెల్లడించింది.

News January 16, 2025

నితీశ్‌కు లోకేశ్ అభినందనలు

image

AP: రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి స్ఫూర్తిగా నిలిచారని మంత్రి లోకేశ్ కొనియాడారు. భారత జట్టుకు మరింతగా సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఇటీవల ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో సత్తా చాటిన నితీశ్ మంత్రిని తాజాగా కలిసారు. ఈ సందర్భంగా మంగళగిరి చేనేత శాలువాతో సన్మానించిన లోకేశ్, జ్ఞాపికను అందించారు.

News January 16, 2025

ఫిబ్రవరి 14 నుంచి WPL ప్రారంభం

image

వచ్చే నెల 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ప్రారంభం కానున్నట్లు BCCI ప్రకటించింది. బరోడా వేదికగా బెంగళూరు-గుజరాత్ మధ్య తొలి మ్యాచ్‌తో సమరానికి తెర లేవనుంది. మొత్తం 5 జట్లు పాల్గొనే ఈ మెగా ఈవెంట్‌లో 22 మ్యాచ్‌లు జరుగుతాయి. బరోడాతో పాటు బెంగళూరు, లక్నో, ముంబైని వేదికలుగా ఖరారు చేశారు. మార్చి 15న ముంబైలో ఫైనల్ జరగనుంది. పూర్తి షెడ్యూల్‌ను పైన ఫొటోల్లో చూడొచ్చు.