News January 4, 2025
రోహిత్ సెలక్టర్ల ఫ్యూచర్ ప్లాన్‌లో లేడేమో: గవాస్కర్
భారత సెలక్టర్ల ఫ్యూచర్ ప్లాన్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ లేడేమోనని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. రానున్న రోజుల్లో జట్టులో భారీ మార్పులు జరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు. ‘ప్రస్తుతం శర్మ వయసు 37. వచ్చే WTC ఫైనల్ నాటికి 41కి చేరుకుంటారు. ఆ వయసులో ఆయన టెస్టులు ఆడడం అనుమానమే. అందుకే ఆయన స్థానంలో యంగ్ లీడర్‌షిప్‌ను బీసీసీఐ తయారు చేస్తుందేమో’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
Similar News
News January 26, 2025
మెదక్: జిల్లా వ్యాప్తంగా మొత్తం 544 సభలు: కలెక్టర్
మెదక్ జిల్లా వ్యాప్తంగా 21 నుంచి 23 వరకు 469 గ్రామ సభలు నిర్వహించినట్టు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు ఆయన మాట్లాడుతూ.. మెదక్ జిల్లా వ్యాప్తంగా 75 వార్డు సభలు నిర్వహించామన్నారు. జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డుకు 40,092, ఇందిరమ్మ ఇళ్లకు 23,383, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 5,501, రైతు భరోసాకు 308 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
News January 26, 2025
వందేళ్ల వయసులో ఆమెకు పద్మశ్రీ
గోవా స్వాతంత్ర్య పోరాటంలో కీలకంగా వ్యవహరించారు లిబియా లోబో సర్దేశాయ్. ఓ క్యాథలిక్ క్రైస్తవ కుటుంబంలో 1924లో జన్మించిన ఆమె, పోర్చుగీసు పాలన నుంచి విముక్తి కోసం ఉద్యమించారు. వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్(Voz da Liberdade) పేరిట అక్కడ 1955లో ఓ భూగర్భ రేడియో కేంద్రాన్ని నడిపి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు. గోవాను భారత్‌లో కలిపేందుకు అప్పట్లో ప్రాణత్యాగానికి సైతం ఆమె సిద్ధం కావడం గమనార్హం.
News January 26, 2025
వన్డే క్రికెట్లో కోహ్లీ మకుటం లేని మహారాజు: కైఫ్
టెస్టుల్లో పేలవ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి పుంజుకుంటారని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డారు. ‘టెస్టుల సంగతి ఎలా ఉన్నా.. వన్డే ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ మకుటం లేని మహారాజు. ఆయనెప్పుడూ ఓటమిని అంగీకరించరు. ఇప్పటికే వన్డేల్లో 50 సెంచరీలు, 13వేల పరుగులు చేశారు. తెల్లబంతిపై ఆయన ఆట వేరే స్థాయిలో ఉంటుంది. ఆయన శకం ఇంకా ముగిసిపోలేదు’ అని పేర్కొన్నారు.