News April 18, 2024
టీమ్ సెలక్షన్ వార్తలపై స్పందించిన రోహిత్

T20 WCకు టీమ్ను సెలక్ట్ చేసేందుకు తాను, BCCI చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ ద్రవిడ్ ముంబైలో భేటీ అయ్యామంటూ వస్తున్న వార్తలపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. ‘అదంతా ఫేక్ న్యూస్. నేనెవరినీ కలవలేదు. అగార్కర్ గోల్ఫ్ ఆడేందుకు దుబాయ్ వెళ్లాడు. ద్రవిడ్ బెంగళూరులో పిల్లలతో గడుపుతున్నాడు. మేం కలుసుకోలేదు. ఏదైనా కీలక సమాచారం ఉంటే మా ముగ్గురిలో ఎవరో ఒకరం అందరికీ తెలియజేస్తాం’ అని వెల్లడించారు.
Similar News
News November 23, 2025
ఆన్లైన్లో సర్వపిండి, సకినాలు!

TG: సర్వపిండి, సకినాలు, కజ్జికాయలు, గవ్వలు వంటి పిండివంటలకు బ్రాండింగ్ కల్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే మేడ్చల్(D)లోని మహిళా సంఘాలకు వీటి తయారీ, ఆకర్షణీయ ప్యాకింగ్, నాణ్యతా ప్రమాణాలపై శిక్షణ ఇప్పించారు. ప్రస్తుతం వీరు FSSAI ధ్రువీకరణతో విక్రయాలు చేస్తున్నారు. ఈ పిండివంటల అమ్మకాలు పెంచేందుకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలతోనూ ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.
News November 23, 2025
టెక్ దిగ్గజాలందర్నీ ఒక చోటకు చేర్చిన AI

టెక్ బిలియనీర్ల ఫొటోలతో క్రియేట్ చేసిన ‘వన్ ట్రిలియన్ స్క్వాడ్’ AI పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్బర్గ్, టిమ్ కుక్, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, శామ్ ఆల్ట్మన్, జెన్సెన్ హువాంగ్ను ఏఐ సహాయంతో పార్టీలో ఉన్నట్టుగా క్రియేట్ చేశారు. సమాంతర విశ్వంలో ఒక చోట, సరదాగా కలుసుకున్న, వన్ ట్రిలియన్ స్క్వాడ్ సమావేశం అంటూ ఫొటోలకు క్యాప్షన్స్ ఇచ్చారు.
News November 23, 2025
సత్యసాయి ఎప్పటికీ జీవించే ఉంటారు: విజయ్ దేవరకొండ

సత్యసాయి బాబాకు హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘విజయ్ సాయి’ అని నా పేరును మీరే పెట్టారు. సురక్షితమైన వాతావరణం, విద్యతో పాటు అనేక జ్ఞాపకాలను మాకు ఇచ్చారు. మంచి, చెడులోనూ మీ గురించే ఆలోచిస్తాం. మీరెప్పటికీ జీవించే ఉంటారు’ అని Xలో పేర్కొన్నారు. పుట్టపర్తిలోనే చదువుకున్న విజయ్ బాబాతో దిగిన చిన్ననాటి ఫొటోను షేర్ చేశారు.


