News April 18, 2024
టీమ్ సెలక్షన్ వార్తలపై స్పందించిన రోహిత్
T20 WCకు టీమ్‌ను సెలక్ట్ చేసేందుకు తాను, BCCI చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ ద్రవిడ్ ముంబైలో భేటీ అయ్యామంటూ వస్తున్న వార్తలపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. ‘అదంతా ఫేక్ న్యూస్. నేనెవరినీ కలవలేదు. అగార్కర్ గోల్ఫ్ ఆడేందుకు దుబాయ్ వెళ్లాడు. ద్రవిడ్ బెంగళూరులో పిల్లలతో గడుపుతున్నాడు. మేం కలుసుకోలేదు. ఏదైనా కీలక సమాచారం ఉంటే మా ముగ్గురిలో ఎవరో ఒకరం అందరికీ తెలియజేస్తాం’ అని వెల్లడించారు.
Similar News
News September 17, 2024
ఒకే వేదికపైకి రేవంత్, కేటీఆర్!
TG: ఒకరిపై మరొకరు నిత్యం తీవ్ర విమర్శలు చేసుకునే సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికను పంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మరణించిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభను ఈనెల 21న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు కేటీఆర్‌కు ఆహ్వానం పంపామని, వారు పాల్గొంటారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.
News September 17, 2024
భారత్vs చైనా.. నేడు ఫైనల్
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస విజయాలతో అదరగొట్టిన భారత పురుషుల హాకీ జట్టు ఇవాళ ఫైనల్‌లో చైనాను ఢీకొట్టనుంది. మధ్యాహ్నం 3.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. సోనీ స్పోర్ట్స్ టెన్-1 ఛానల్, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగుతున్న టీమ్ ఇండియా ఐదో ట్రోఫీ సాధించాలని పట్టుదలగా ఉంది. అనూహ్యంగా ఫైనల్ చేరిన చైనా తొలి టైటిల్ కోసం ఆరాటపడుతోంది.
News September 17, 2024
గణేశ్ నిమజ్జనం.. మద్యం షాప్‌లు బంద్
TG: గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో HYD వ్యాప్తంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచే మద్యం షాప్‌లు క్లోజ్ అయ్యాయి. రేపు సాయంత్రం 6 వరకు వైన్స్, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు మూసేయాలని పోలీస్ కమిషనర్ CV ఆనంద్ ఇప్పటికే ఉత్తర్వులిచ్చారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. స్టార్ హోటల్ బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లలో మాత్రం యథావిధిగా మద్యం అందుబాటులో ఉండనుంది.