News August 29, 2024

స్టైలిష్ లుక్‌లో రోహిత్ శర్మ

image

టీమ్‌ఇండియా ODI, టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ యాడ్ షూట్ కోసం స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిట్‌మ్యాన్ లుక్ అదిరిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా భారత జట్టు తన తర్వాతి టెస్ట్ సిరీస్‌ను సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో ఆడనుంది.

Similar News

News September 9, 2024

ప్రపంచ వారసత్వ కట్టడాలు: భారత్‌లో ఎన్నంటే?

image

పురాతన కట్టడాలన్నింటినీ UNESCO ప్రపంచ వారసత్వ కట్టడాలుగా గుర్తించదు. ఎన్నో ఏళ్లు కృషి చేస్తే తెలంగాణలోని రామప్ప ఆలయానికి ఈ అవకాశం లభించింది. అయితే, అత్యధికంగా UNESCO గుర్తించిన కట్టడాలు ఏ దేశంలో ఉన్నాయో తెలుసా? 60 కట్టడాలతో ప్రథమ స్థానంలో ఇటలీ ఉంది. తర్వాతి స్థానాల్లో చైనా (59), జర్మనీ (54), ఫ్రాన్స్(53), స్పెయిన్ (50) ఉన్నాయి. 43 ప్రపంచ వారసత్వ కట్టడాలు కలిగి ఉన్న భారతదేశం 6వ స్థానంలో ఉంది.

News September 9, 2024

NTR ‘దేవర’ క్రేజ్ ఇదే!

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ మూవీ ప్రీబుకింగ్స్‌లో గత రికార్డులను బ్రేక్ చేసే దిశగా దూసుకెళ్తోంది. సినిమా రిలీజ్‌కు ఇంకా 18 రోజులు ఉండగా, ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండానే ‘దేవర’ నార్త్ అమెరికా బుకింగ్స్‌లో $1Mకు చేరువైంది. రేపు విడుదలయ్యే ట్రైలర్ అంచనాలు పెంచితే ఈ క్రేజ్ మరింత పీక్స్‌కు చేరే ఛాన్సుంది. ఈ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది.

News September 9, 2024

మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబుకు అస్వస్థత

image

TG: మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన అనారోగ్యానికి గురయ్యారని సమాచారం. దీంతో హుటాహుటిన ఆయనను గ్రీన్ ఛానెల్ ద్వారా ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. హరిబాబు ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.