News May 2, 2024

ముంబై కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ

image

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా లేకపోవడంపై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు రోహిత్ శర్మ తొలిసారి స్పందించారు. ‘నేను ఇప్పుడు టీమ్ఇండియా కెప్టెన్‌గా ఉన్నా. రేపు ఉండకపోవచ్చు. ఇదంతా జీవితంలో ఒక భాగం. అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. గతంలోనూ నేను ఇతరుల నాయకత్వంలో ఆడా. ఒక ప్లేయర్‌గా రాణించేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తా. గత నెల రోజులుగా అదే చేస్తున్నా’ అని హిట్‌మ్యాన్ చెప్పారు.

Similar News

News November 22, 2025

‘రైతన్న- మీకోసం’ వారోత్సవాలు నిర్వహించాలి: కలెక్టర్

image

ఈ నెల 24 నుంచి 29 వరకు అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో ‘రైతన్న- మీకోసం వారోత్సవాలు’ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. శనివారం ఆమె వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 29 వరకు రైతుల ఇళ్లను సందర్శించాలని, ఆ సమాచారాన్ని డిసెంబర్ 2 వరకు విశ్లేషించాలని కలెక్టర్ సూచించారు. ఈ వారోత్సవాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.

News November 22, 2025

నాన్న 50ఏళ్లు ఇండస్ట్రీని తన భుజాలపై మోశారు: విష్ణు

image

తెలుగు సినిమా పరిశ్రమలో మంచు మోహన్ బాబు 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచు విష్ణు ఎమోషనల్ పోస్ట్ చేశారు. ’94 ఏళ్ల తెలుగు చిత్ర పరిశ్రమను 50 ఏళ్లు మా నాన్న తన భుజాలపై మోశారు. ఆయన అసాధారణ ప్రయాణాన్ని చూడగలిగినందుకు ఎంతో గర్వంగా ఉంది. 50 లెజెండరీ ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు నాన్న’ అని ట్వీట్ చేశారు. ప్యారడైజ్ మూవీలో మోహన్ బాబు నటిస్తున్న విషయం తెలిసిందే.

News November 22, 2025

గుర్తులేదు.. మరిచిపోయా: ఐబొమ్మ రవి

image

TG: మూడో రోజు పోలీసుల విచారణలో ఐబొమ్మ రవి సమాధానాలు దాట వేసినట్లు తెలుస్తోంది. అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పాడట. బ్యాంకు ఖాతాల వివరాలపైనా నోరు విప్పలేదని సమాచారం. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు అడిగితే గుర్తులేదని, మరిచిపోయానని తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఎథికల్‌ హ్యాకర్ల సాయంతో హార్డ్‌‌డిస్క్‌లు, పెన్‌‌డ్రైవ్‌లు ఓపెన్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.