News November 23, 2024

రోహిత్ శర్మను మిడిలార్డర్‌లో ఆడించాలి: మాజీ బౌలర్

image

రోహిత్ శర్మ వచ్చిన తర్వాత కూడా కేఎల్ రాహుల్‌నే ఓపెనర్‌గా కొనసాగించాలని భారత మాజీ బౌలర్ దొడ్డ గణేశ్ అభిప్రాయపడ్డారు. జైస్వాల్, రాహుల్ కాంబినేషన్ బాగుందని, సిరీస్ అంతా వీరిద్దరినే కొనసాగించాలని సూచించారు. ‘ఈ ఓపెనింగ్ భాగస్వామ్యం కొనసాగాలి. రోహిత్‌ మిడిలార్డర్‌లో ఆడొచ్చు. కామన్ సెన్స్‌తో ఆలోచిస్తారని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

Similar News

News November 23, 2024

ఫ‌లితాల్ని ఊహించ‌లేదు: రాహుల్ గాంధీ

image

మ‌హారాష్ట్ర ఫ‌లితాల్ని ఊహించ‌లేద‌ని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఓట‌మిపై స‌మీక్షించుకుంటామ‌ని పేర్కొన్నారు. ఝార్ఖండ్‌లో భారీ మెజారిటీ ఇచ్చినందుకు ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇండియా కూటమి సాధించిన ఈ విజయం రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ‌తోపాటు స‌హ‌జ వ‌న‌రుల ప‌రిరక్ష‌ణ విజ‌యంగా అభివ‌ర్ణించారు. ఝార్ఖండ్‌లో JMM 28 సీట్లలో గెలిచి మరో 6 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 11 చోట్ల గెలిచి 5 చోట్ల లీడ్‌లో ఉంది.

News November 23, 2024

‘మహాయుతి’కి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

image

మహారాష్ట్రలో ‘మహాయుతి’ మెజార్టీ స్థానాల్లో గెలవడం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. విజనరీ ప్రధాని మోదీ నాయకత్వంపై రాష్ట్ర ప్రజలు నమ్మకం ఉంచారని.. నిజాయితీ, అభివృద్ధికి ఓటేశారని పేర్కొన్నారు. ఫడణవీస్, ఏకనాథ్ శిండే, అజిత్ పవార్ సమష్టిగా పోరాడారని కొనియాడారు. ఎన్డీఏ అభ్యర్థుల తరఫున మహారాష్ట్రలో తాను ప్రచారం చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

News November 23, 2024

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, CM దిగ్భ్రాంతి

image

AP: అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు <<14688076>>ప్రమాదంలో<<>> మృతుల సంఖ్య ఏడుకు చేరింది. గార్లదిన్నె మం. కలగాసుపల్లె వద్ద ఆర్టీసీ బస్సు 12 మంది కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఘటనాస్థలంలో ఇద్దరు, ఆస్పత్రిలో ఐదుగురు మరణించారు. ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.