News November 23, 2024
రోహిత్ శర్మను మిడిలార్డర్‌లో ఆడించాలి: మాజీ బౌలర్
రోహిత్ శర్మ వచ్చిన తర్వాత కూడా కేఎల్ రాహుల్‌నే ఓపెనర్‌గా కొనసాగించాలని భారత మాజీ బౌలర్ దొడ్డ గణేశ్ అభిప్రాయపడ్డారు. జైస్వాల్, రాహుల్ కాంబినేషన్ బాగుందని, సిరీస్ అంతా వీరిద్దరినే కొనసాగించాలని సూచించారు. ‘ఈ ఓపెనింగ్ భాగస్వామ్యం కొనసాగాలి. రోహిత్ మిడిలార్డర్‌లో ఆడొచ్చు. కామన్ సెన్స్‌తో ఆలోచిస్తారని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 11, 2024
ప్రపంచంలో భారత ఫుడ్ టేస్ట్ ర్యాంకు ఎంతంటే…
ప్రపంచంలో అత్యంత రుచికరమైన ఆహారం కలిగిన 100 దేశాల్లో భారత్ 12వ స్థానాన్ని దక్కించుకుంది. టేస్ట్ అట్లాస్ సంస్థ ఈ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. అగ్రస్థానంలో గ్రీస్, తర్వాతి స్థానాల్లో వరుసగా ఇటాలియన్, మెక్సికన్, స్పానిష్, పోర్చుగీస్ ఆహారాలున్నాయి. భారత వంటకాల్లో హైదరాబాదీ బిర్యానీ, అమృతసరీ కుల్చా, బటర్ గార్లిక్ నాన్, బటర్ చికెన్ రుచికరమైనవని టేస్ట్ అట్లాస్ స్పష్టం చేసింది.
News December 11, 2024
మోదీని కలిసిన రాజ్ కపూర్ ఫ్యామిలీ
దిగ్గజ హిందీ నటుడు రాజ్ కపూర్ కుటుంబ సభ్యులు ప్రధాని మోదీతో ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ తదితరులు మోదీని కలిశారు. రాజ్ కపూర్ 100వ జయంతి స్మారకార్థంగా నిర్వహిస్తున్న RK Film Festivalలో పాల్గొనాల్సిందిగా వారు మోదీని ఆహ్వానించారు. 13 నుంచి 15 వరకు 3 రోజులపాటు 40 నగరాల్లో 10 రాజ్ కపూర్ చిత్రాలను ప్రదర్శించనున్నారు.
News December 11, 2024
మనోజ్ మీడియా సమావేశం వాయిదా
TG: రాచకొండ సీపీ కార్యాలయంలో సీపీని కలిసిన నటుడు మంచు మనోజ్ తిరిగి జల్‌పల్లిలోని నివాసానికి చేరుకున్నారు. తాను ఎవరితో గొడవపెట్టుకోనని సీపీకి హామీ ఇచ్చారు. ఆయన సూచన మేరకు మీడియా సమావేశం వాయిదా వేశారు.