News January 20, 2025

పదేళ్ల తర్వాత రంజీ ఆడనున్న రోహిత్

image

ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే ముంబై VS జమ్మూకశ్మీర్ 3 రోజుల రంజీ మ్యాచులో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొననున్నారు. ముంబై తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న హిట్‌మ్యాన్ చివరిసారిగా 2015లో రంజీ ఆడారు. ముంబైకి అజింక్య రహానే కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. జట్టులో యశస్వీ జైస్వాల్, శివమ్ దూబే, శ్రేయస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్ లాంటి జాతీయ క్రికెటర్లు ఉన్నారు.

Similar News

News February 16, 2025

శ్రీశైలం విశిష్టత మీకు తెలుసా…!

image

ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలక్షేత్రం <<15471616>>రెండోది<<>>. ఈ మందిరంలో పరమేశ్వరుడు మల్లికార్జున స్వామిగా భక్తులకు దర్శనమిస్తారు. పూర్వం కుమారస్వామిని వెతకడానికి క్రౌంచ పర్వతం (శ్రీశైలం) వెళ్లిన శివుడు ఆయన ఉన్నచోటనే లింగరూపంలో వెలిశారు. అక్కడ మద్ది చెట్టుకు మల్లెతీగ అద్దుకొని ఉందట. అప్పటినుంచి స్వామి వారికి ‘మల్లికార్జునుడు’ అని పేరొచ్చిందని స్థలపురాణం పేర్కొంటుంది.

News February 16, 2025

భారత్‌కు వారసులు హిందువులే: మోహన్ భాగవత్

image

దేశంలో హిందూ సమాజమే బాధ్యతాయుతమైనదని RSS చీఫ్ మోహన్ భాగవత్ చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందనే సత్యాన్ని హిందువులు విశ్వసిస్తారన్నారు. బెంగాల్‌లో మాట్లాడుతూ భారత్‌కు వారసులు హిందువులేనని పేర్కొన్నారు. ‘పాలకులు, మహారాజులను దేశం గుర్తుంచుకోదు. కానీ తండ్రి మాటకు కట్టుబడి 14ఏళ్ల వనవాసం చేసిన రాజును, సోదరుడి చెప్పులతో పాలన చేసిన వ్యక్తిని గుర్తుంచుకుంటుంది’ అని తెలిపారు.

News February 16, 2025

నెక్స్ట్ టార్గెట్ కొడాలి, పేర్ని నానిలే: మంత్రి కొల్లు

image

AP: వైసీపీ నేతలు చేసిన పాపాలే వారిని జైలుపాలు చేస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అనేక తప్పులు చేస్తున్నారని విమర్శించారు. ‘నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది కొడాలి నాని, పేర్ని నానిలే. వైసీపీ హయాంలో వీరిద్దరూ అవినీతి, అరాచకాలకు పాల్పడ్డారు. వీటిపై విచారణ చేసి వీరిని జైలుకు పంపుతాం’ అని ఆయన హెచ్చరించారు.

error: Content is protected !!