News July 20, 2024
ఆ ఓవర్లో రోహిత్ చాలా మద్దతునిచ్చారు: అక్షర్

టీ20 WC-2024 ఫైనల్లో అక్షర్ పటేల్ ఓవర్‌లో సౌతాఫ్రికా బ్యాటర్ క్లాసెన్ విధ్వంసం సృష్టించారు. అయినా సరే తనకు అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతుగా నిలిచారని అక్షర్ తెలిపారు. ‘ఓవర్ మధ్యలో రోహిత్ నా వద్దకు వచ్చారు. బ్యాటర్ బాగా ఆడుతుంటే నీ తప్పు కాదు. తర్వాతి బంతి గురించే ఆలోచించు అన్నారు. ఓవర్ అయిపోయాక కూడా నా భుజం తట్టి బాగానే వేశావు, టెన్షన్ పడకంటూ ధైర్యమిచ్చారు’ అని గుర్తుచేసుకున్నారు.
Similar News
News November 16, 2025
SBIలో 103 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు.. అప్లై చేశారా?

SBIలో 103 కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, PG, CA, CFA,CFP,MBA, పీజీ డిప్లొమా, PGDM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వయసు 25-50ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.750, SC, ST, PWBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://sbi.bank.in/
News November 16, 2025
తమిళనాడు నుంచి ఏపీకి $150 మిలియన్ల పెట్టుబడులు

సౌత్ కొరియాకు చెందిన Hwaseung కంపెనీ ఏపీలో $150 మిలియన్ల పెట్టుబడులు పెట్టనుంది. కుప్పంలో నాన్-లెదర్ స్పోర్ట్స్ షూలను ఉత్పత్తి చేయనుంది. గ్లోబల్ బ్రాండ్లైన Nike, Adidasలను ఈ సంస్థే తయారు చేస్తుంది. కుప్పంలో ఏడాదికి 20 మిలియన్ల షూ జతలను ఉత్పత్తి చేయనున్నారు. 20వేల మందికి ఉపాధి దక్కే అవకాశం ఉంది. ఈ ఆగస్టులో తమిళనాడుతో ఒప్పందం చేసుకున్నా తాజాగా ఏపీకి వస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.
News November 16, 2025
టెస్టుకు దూరమైన గిల్

టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. దీంతో సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆయన పాల్గొనరని BCCI వెల్లడించింది. రెండో రోజు బ్యాటింగ్ చేస్తూ గిల్ మెడనొప్పితో మైదానాన్ని వీడారు. అటు ఇవాళ మూడో రోజు ఆట ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్సులో సౌతాఫ్రికా స్కోర్ 93/7గా ఉంది.


