News July 20, 2024

ఆ ఓవర్లో రోహిత్ చాలా మద్దతునిచ్చారు: అక్షర్

image

టీ20 WC-2024 ఫైనల్లో అక్షర్ పటేల్ ఓవర్‌లో సౌతాఫ్రికా బ్యాటర్ క్లాసెన్ విధ్వంసం సృష్టించారు. అయినా సరే తనకు అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతుగా నిలిచారని అక్షర్ తెలిపారు. ‘ఓవర్ మధ్యలో రోహిత్ నా వద్దకు వచ్చారు. బ్యాటర్ బాగా ఆడుతుంటే నీ తప్పు కాదు. తర్వాతి బంతి గురించే ఆలోచించు అన్నారు. ఓవర్ అయిపోయాక కూడా నా భుజం తట్టి బాగానే వేశావు, టెన్షన్ పడకంటూ ధైర్యమిచ్చారు’ అని గుర్తుచేసుకున్నారు.

Similar News

News July 9, 2025

టెస్ట్ ర్యాంకింగ్స్: టాప్-10లోకి భారత కెప్టెన్

image

మెన్స్ క్రికెట్ టెస్ట్ ర్యాంకులను ICC ప్రకటించింది. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ నం.1 స్థానంలో నిలవగా మరో బ్యాటర్ రూట్ ఓ స్థానం దిగజారి నం.2లో కొనసాగుతున్నారు. భారత బ్యాటర్ జైస్వాల్ నాలుగో స్థానంలో, కెప్టెన్ గిల్ ఏకంగా 15 స్థానాలు ఎగబాకి ఆరో స్థానంలో నిలిచారు. వికెట్ కీపర్ పంత్ ఒక స్థానం దిగజారి 8వ స్థానంలో ఉన్నారు. అటు టెస్టుల్లో ఆస్ట్రేలియా, వన్డే, టీ20ల్లో టీమ్ ఇండియా తొలి స్థానంలో ఉన్నాయి.

News July 9, 2025

‘శబరి’ రైలు ఇక సూపర్‌‌ఫాస్ట్

image

సికింద్రాబాద్-తిరువనంతపురం మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్‌ను సూపర్‌ఫాస్ట్‌గా మారుస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఈ రైలు మ.2.35 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి తర్వాతి రోజు సా.6.20కు తిరువనంతపురం చేరనుంది. అలాగే అక్కడ ఉ.6.45కు బయల్దేరి తర్వాతి రోజు ఉ.11 గంటలకే సికింద్రాబాద్ రానుంది. ఈ కొత్త షెడ్యూల్ ఎప్పట్నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై త్వరలోనే అధికారులు స్పష్టత ఇవ్వనున్నారు.

News July 9, 2025

గోల్డెన్ వీసాపై రూమర్లు నమ్మొద్దు: UAE

image

తాము ప్రవేశపెట్టబోయే <<16986034>>గోల్డెన్ వీసాపై<<>> వస్తున్న రూమర్లను ఎవరూ నమ్మొద్దని UAE తెలిపింది. దీనిపై ఎలాంటి థర్డ్ పార్టీ సంస్థకు హక్కులు ఇవ్వలేదని, తమ దేశ అధికారిక సైట్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మధ్యవర్తులను సంప్రదించవద్దని కోరింది. ఈ విషయంలో ఎవరైనా మోసానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరిన్ని వివరాలకు 600522222ను సంప్రదించాలని సూచించింది.