News October 27, 2024

అత్యుత్తమ టెస్టు జట్టులో రోహిత్ ఓపెనర్‌గా ఉంటారు: స్మిత్

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆటతీరుపై ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచ ఆటగాళ్లతో అత్యుత్తమ టెస్టు జట్టును తయారుచేస్తే దానికి ఓపెనర్‌గా తాను రోహిత్‌నే ఎంచుకుంటానని తెలిపారు. ‘రోహిత్ చాలా ప్రమాదకర ప్లేయర్. నిర్భయంగా తన షాట్స్ ఆడతారు. అవసరమైతే అద్భుతంగా డిఫెండ్ కూడా చేసుకోగలరు. అతడు క్రీజులో ఉన్నప్పుడు బౌలర్లు ఒత్తిడికి గురవుతారు’ అని పేర్కొన్నారు.

Similar News

News December 20, 2025

భారత్‌పై డికాక్ రికార్డు

image

టీమ్ ఇండియాపై T20Iల్లో అత్యధిక అర్ధసెంచరీలు చేసిన ప్లేయర్‌గా దక్షిణాఫ్రికా ప్లేయర్ డికాక్ నిలిచారు. ఇవాళ్టి మ్యాచులో ఫిఫ్టీతో కలుపుకొని భారత్‌పై 14 ఇన్నింగ్సుల్లోనే ఆరు అర్ధసెంచరీలు నమోదు చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో వెస్టిండీస్ ప్లేయర్ పూరన్(20 ఇన్నింగ్స్‌ల్లో 5), ఇంగ్లండ్ ప్లేయర్ బట్లర్ (24 ఇన్నింగ్స్‌ల్లో 5) ఉన్నారు.

News December 20, 2025

ప్రపంచంలో స్త్రీని చూడని ఏకైక పురుషుడు!

image

స్త్రీ, పురుషులు ఒకరి ముఖం ఒకరు చూడకుండా ఉంటారా? కానీ గ్రీస్‌కు చెందిన ఓ వ్యక్తి తన 82ఏళ్ల జీవితంలో ఒక్కసారి కూడా స్త్రీ ముఖం చూడలేదు. మిహైలో టొలోటోస్ అనే సన్యాసి 1856లో జన్మించగా.. పుట్టిన 4 గంటల్లోనే తల్లి చనిపోయింది. దీంతో అతడిని సన్యాసులు స్త్రీలకు ప్రవేశం లేని మౌంట్ అథోస్‌కు తీసుకెళ్లారు. కారు, విమానం వంటి ఆధునిక ప్రపంచపు ఆనవాళ్లు కూడా ఆయనకు తెలియవు. జీవితాంతం ప్రార్థనలతో గడిపారు.

News December 20, 2025

కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్న సూర్య!

image

సూర్య కుమార్ యాదవ్ టీమ్ ఇండియా T20I కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20న టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించనున్న సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ ముగిశాక కెప్టెన్‌గా ఆయన తప్పుకుంటారని INDIA TODAY కథనం పేర్కొంది. కొంత కాలంగా తన ప్రదర్శన ఆశాజనకంగా లేకపోవడమే దీనికి కారణమని వెల్లడించింది. ఫిబ్రవరి 7నుంచి WC మొదలుకానున్న సంగతి తెలిసిందే.