News October 27, 2024
అత్యుత్తమ టెస్టు జట్టులో రోహిత్ ఓపెనర్‌గా ఉంటారు: స్మిత్
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆటతీరుపై ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచ ఆటగాళ్లతో అత్యుత్తమ టెస్టు జట్టును తయారుచేస్తే దానికి ఓపెనర్‌గా తాను రోహిత్‌నే ఎంచుకుంటానని తెలిపారు. ‘రోహిత్ చాలా ప్రమాదకర ప్లేయర్. నిర్భయంగా తన షాట్స్ ఆడతారు. అవసరమైతే అద్భుతంగా డిఫెండ్ కూడా చేసుకోగలరు. అతడు క్రీజులో ఉన్నప్పుడు బౌలర్లు ఒత్తిడికి గురవుతారు’ అని పేర్కొన్నారు.
Similar News
News November 7, 2024
IPL: రూ.2 కోట్ల బేస్‌ప్రైజ్‌లో మనోళ్లు వీరే
IPL మెగా వేలంలో ఈసారి భారత్ నుంచి 23 మంది ఆటగాళ్లు రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో బరిలోకి దిగుతున్నారు. వీరిలో రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అశ్విన్, చాహల్, వెంకటేశ్ అయ్యర్, ఇషాన్ కిషన్, పడిక్కల్, కృనాల్ పాండ్య, షమీ, సిరాజ్, అర్ష్‌దీప్, వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, అవేశ్ ఖాన్, ముకేశ్, ప్రసిద్ధ్ కృష్ణ, నటరాజన్, హర్షల్ పటేల్, భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్ ఉన్నారు.
News November 7, 2024
అమెరికా ఎన్నికల్లో ‘భారతీయం’.. ఆరుగురి గెలుపు
2020 US ఎన్నికల్లో ఐదుగురు ఇండో-అమెరికన్లు గెలవగా, ఈసారి ఆ సంఖ్య ఆరుకు చేరింది. వీరంతా డెమొక్రటిక్ పార్టీ నుంచే విజయ కేతనం ఎగురవేశారు. వారిలో కాలిఫోర్నియా నుంచి అమీ బెరా, రో ఖన్నా(మూడోసారి), మిచిగాన్ నుంచి థానే దార్, ఇల్లినాయిస్ నుంచి రాజాకృష్ణమూర్తి(థర్డ్ టైమ్), వాషింగ్టన్ నుంచి ప్రమీలా జయపాల్ ఉన్నారు. వర్జీనియా నుంచి తొలిసారి గెలిచిన భారతీయ అమెరికన్‌గా సుహాస్ సుబ్రమణ్యం రికార్డు సృష్టించారు.
News November 7, 2024
మరో వారంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ?
AP: మరో వారంలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి జాబితా కంటే రెండు మూడు రెట్ల పదవులు ఎక్కువగా ఉంటాయని సమాచారం. మొత్తం 50 BC కార్పొరేషన్‌లు ఉండగా 35 వరకు భర్తీ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిలో JSP, BJP నేతలకు కూడా కొన్ని కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ల ఛైర్మన్లతోపాటు సభ్యులను కూడా నియమిస్తున్నట్లు టాక్.