News November 1, 2024
రోహిత్ ఫ్లాప్ షో కంటిన్యూ..!
న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో హిట్‌మ్యాన్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ముంబై వేదికగా జరుగుతోన్న మూడో టెస్టులోనూ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచారు. కేవలం 18 బంతులు ఎదుర్కొని 18 రన్స్ చేసి ఔటయ్యారు. గత ఐదు ఇన్నింగ్సుల్లో రోహిత్ ప్రదర్శన ఇలా ఉంది. 18(18), 8(16), 0(9), 52(63), 2(16). వీటిలో ఒక అర్ధ సెంచరీ మాత్రమే ఉంది. కాగా మూడో టెస్టులో NZ 235 పరుగులకు ఆలౌటైంది.
Similar News
News December 13, 2024
అల్లు అర్జున్‌కు కోర్టు కీలక ఆదేశాలు
సుదీర్ఘ వాదనల అనంతరం అల్లు అర్జున్‌కు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు సొంత పూచీకత్తు సమర్పించాలని ఆయనను ఆదేశించింది. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించాలంది. తదుపరి విచారణను JAN 11కు వాయిదా వేసింది. అలాగే క్వాష్ పిటిషన్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ ఘటనలో సంధ్య థియేటర్ యాజమాన్యానికి ఇవే ఆదేశాలు వర్తిస్తాయని కోర్టు పేర్కొంది.
News December 13, 2024
బౌలర్‌ని కాదు.. బంతినే చూస్తాం: గిల్
ఆస్ట్రేలియాపై ఆడేందుకు భయపడట్లేదని భారత యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ వ్యాఖ్యానించారు. ‘గెలవకపోవడం వల్ల భయపడుతున్నామంటే అర్థం ఉంది. మేం చివరిగా ఇక్కడ ఆడినప్పుడు గెలిచాం. భారత్‌లోనూ ఆస్ట్రేలియాను ఓడించాం. బౌలింగ్ ఎవరు చేస్తున్నారన్నది మా జనరేషన్ పట్టించుకోదు. కేవలం బంతినే చూస్తుంది. ఓ టీమ్‌గా ఎలా పోరాడాలన్నదానిపైనే ప్రస్తుతం జట్టు దృష్టిపెట్టింది. మా దృష్టిలో ఇక ఇది 3 టెస్టుల సిరీస్’ అని పేర్కొన్నారు.
News December 13, 2024
అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్
నాంపల్లి కోర్టు కాసేపటి క్రితం 14 రోజుల రిమాండ్ విధించిన అల్లు అర్జున్‌కు ఊరట లభించింది. హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. తనపై కేసులు కొట్టేయాలని బన్నీ క్వాష్ పిటిషన్‌పై సుధీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి కేసులన్నీ కొట్టేయలేమన్నారు. అయితే తాత్కాలిక ఊరటగా రూ.50 వేల పూచీకత్తుతో 4 వారాల ‘పరిమిత కాల బెయిల్ ఇస్తాం’ అని ఆదేశాలిచ్చారు. కాగా బన్నీని పోలీసులు ఇప్పటికే చంచల్‌గూడ జైలుకు తరలించారు.