News October 1, 2024

మ్యాచ్‌లో రోహిత్ ఇచ్చిన సందేశం ఏంటంటే..: KL రాహుల్

image

బంగ్లాతో రెండో టెస్టులో రెండున్నర రోజుల ఆట వర్షార్పణమైనప్పటికీ టీమ్ ఇండియా అద్భుత ఆటతో విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడే దీనిక్కారణమని కేఎల్ రాహుల్ తెలిపారు. ‘ఎంత వీలైతే అంత ట్రై చేసి గెలవడానికే చూడాలని 4వ రోజు ఆట మొదలయ్యే సమయానికి రోహిత్ క్లియర్‌గా చెప్పారు. దీంతో దూకుడుగా ఆడేందుకు ఆటగాళ్లకు స్వేచ్ఛ లభించింది. వికెట్లు పడుతున్నా ఆ దూకుడును కొనసాగించి విజయం సాధించాం’ అని వెల్లడించారు.

Similar News

News October 4, 2024

విజయ్ ‘దళపతి 69’ షురూ

image

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆఖరి చిత్రం ‘దళపతి69’ పూజా కార్యక్రమం చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 2025లో ఈ మూవీని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. హెచ్ వినోద్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తారు. బాబీ డియోల్, గౌతమ్ మీనన్, ప్రియమణి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తారు. అనిరుధ్ సంగీతం అందిస్తారు.

News October 4, 2024

ఎవరు పెద్ద హీరో?.. సురేశ్ బాబు సమాధానమిదే

image

టాలీవుడ్‌లో బిగ్ స్టార్ ఎవరు? అనే ప్రశ్నకు ఓ ఇంటర్వ్యూలో నిర్మాత సురేశ్ బాబు ఆసక్తికర సమాధానమిచ్చారు. ‘కలెక్షన్ల ఆధారంగా హీరోల స్థాయిని నిర్ణయించలేం. పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ తదితర హీరోల సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తాయి. కానీ ఏంతీసినా ప్రేక్షకులు చూస్తారని అనుకోకూడదు. వారి సినిమాలు కొన్ని అంచనాలను అందుకోలేదు. తెలుగులో రూ.100 కోట్లు సాధించే హీరోలు చాలామంది ఉన్నారు’ అని పేర్కొన్నారు.

News October 4, 2024

రేవంత్ మొనగాడు కాదు.. మోసగాడు: హరీశ్

image

TG: దేవుళ్లపై ఒట్లు వేసి మాట తప్పిన సీఎం రేవంత్ మొనగాడు కాదు, మోసగాడని BRS మాజీ మంత్రి, MLA హరీశ్‌రావు విమర్శించారు. కుంటిసాకుతో రుణమాఫీ ఎగ్గొట్టి, ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. దసరాలోపు రైతుబంధు పడకపోతే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. దసరా తర్వాత రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని అన్నారు.