News June 6, 2024

క్యూట్ ఫొటో షేర్ చేసిన రోహిత్ తల్లి

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ సోషల్ మీడియాలో ఓ క్యూట్ ఫొటో షేర్ చేశారు. రోహిత్ 2007 T20 వరల్డ్ కప్ నాటి ఫొటో, 2024 WC ఫొటో కలిపి ఆమె పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీ20 WC తొలి మ్యాచ్‌లో రోహిత్ హాఫ్ సెంచరీ చేయడంతో ఆమె ఈ పిక్ షేర్ చేశారు. కాగా రోహిత్ తల్లి పూర్ణిమ విశాఖపట్నానికి చెందినవారే. తండ్రి గురునాథ్ శర్మ మహారాష్ట్రకు చెందినవ్యక్తి.

Similar News

News December 14, 2025

జనవరి 12న ‘మన శంకర వరప్రసాద్ గారు’

image

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇవాళ ప్రెస్‌మీట్‌లో మూవీ విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించగా విక్టరీ వెంకటేశ్ కీ రోల్‌లో కనిపించనున్నారు. కాగా సంక్రాంతి బరిలో ప్రభాస్ ‘రాజాసాబ్(JAN 9)’, శర్వానంద్ ‘నారీనారీ నడుమ మురారి(JAN 14)’ కూడా ఉన్నాయి.

News December 14, 2025

అర్ధరాత్రి వరకు పడుకోవట్లేదా.. ఎంత ప్రమాదమంటే?

image

మారుతున్న జీవనశైలిలో యువత లేట్ నైట్ వరకు పడుకోవట్లేదు. ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘అర్ధరాత్రి 12, ఒంటి గంట వరకు మేల్కొని ఉంటే ముఖ్యంగా మెంటల్ హెల్త్ దెబ్బతింటుంది. ఏకాగ్రత కోల్పోతారు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది, ఎమోషనల్‌గానూ వీక్ అవుతారు. BP, షుగర్, ఒబెసిటీ, ఇమ్యూనిటీ తగ్గడం, జీవితకాలం కూడా తగ్గిపోతుంది’ అని హెచ్చరిస్తున్నారు.

News December 13, 2025

అంధ క్రికెటర్ల ఇళ్లలో కాంతులు

image

AP: అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌ దీపిక(సత్యసాయి), ప్లేయర్ పాంగి కరుణ (అల్లూరి) ఇళ్లలో Dy.CM పవన్ కళ్యాణ్ కాంతులు నింపారు. వారికి TV, ఫ్యాన్, ఇతర గృహోపకరణాలు, నిత్యావసరాలు, బట్టలు, దుప్పట్లు పంపించారు. క్రీడాకారుల కోటాలో కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తమ ఊరికి వెళ్లే 2 రోడ్లు ప్రయాణానికి యోగ్యంగా లేవని దీపిక చెప్పడంతో రూ.6.2 కోట్లతో రోడ్లను పవన్ <<18548703>>మంజూరు<<>> చేయడం తెలిసిందే.