News December 3, 2024
రోహిత్‌కు సరైన వారసుడు బుమ్రాయే: పుజారా
భారత టెస్టు కెప్టెన్సీలో రోహిత్ శర్మకు జస్ప్రీత్ బుమ్రా సరైన వారసుడని భారత క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా అభిప్రాయపడ్డారు. ‘దీర్ఘకాల కెప్టెన్సీకి బుమ్రాయే సరైన ఆప్షన్. అందులో ఎలాంటి డౌట్ లేదు. స్వదేశంలో సిరీస్ ఓటమి ఒత్తిడి అనంతరం ఆస్ట్రేలియా వంటి చోట సిరీస్‌లో తొలి టెస్టునే గెలిపించడం చిన్న విషయం కాదు. బుమ్రాకి సామర్థ్యం ఉంది. పైగా తనెప్పుడూ జట్టుకోసమే ఆలోచించే వ్యక్తి’ అని కొనియాడారు.
Similar News
News January 22, 2025
నోటిఫికేషన్ వచ్చేసింది..
UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) నోటిఫికేషన్ రిలీజైంది. 979 పోస్టుల భర్తీకి జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు. మే 25న ప్రిలిమ్స్ జరగనుంది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు, 21-32 ఏళ్ల వయసు ఉన్నవారు దీనికి అర్హులు. దరఖాస్తు చేసుకునేందుకు సైట్: <
News January 22, 2025
అమరావతికి హడ్కో రూ.11వేల కోట్ల నిధులు: మంత్రి నారాయణ
AP: రాజధాని అమరావతి నిర్మాణం కోసం హడ్కో రూ.11వేల కోట్ల నిధులు విడుదల చేసేందుకు అంగీకరించిందని మంత్రి నారాయణ తెలిపారు. ముంబైలో జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. హడ్కో ద్వారా రూ.11వేల కోట్ల రుణం పొందేందుకు చర్చలు జరిపామన్నారు. దీంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని నారాయణ పేర్కొన్నారు.
News January 22, 2025
కృష్ణ జన్మభూమి కేసు: స్టే పొడిగించిన సుప్రీంకోర్టు
మథురలో షాహీ ఈద్గాను కోర్టు కమిషనర్ తనిఖీ చేయాలన్న అలహాబాద్ హైకోర్టు ఆర్డర్‌పై తాత్కాలిక స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. 2025, ఏప్రిల్ 1కి విచారణను వాయిదా వేసింది. అప్పటి వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది. కృష్ణ జన్మస్థానమైన ఇక్కడి మందిరాన్ని ఔరంగజేబు కూల్చేసి ఈద్గా నిర్మించాడన్నది చరిత్ర. ఇక్కడ పూజచేసుకొనే హక్కు కల్పించాలని హిందూ సంఘాలు స్థానిక కోర్టుకెళ్లడంతో వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.