News July 11, 2024

రేషన్ బియ్యం అక్రమ తరలింపులో IPSల పాత్ర: నాదెండ్ల

image

AP: రేషన్ బియ్యం అక్రమ తరలింపులో ఐదుగురు IPS అధికారుల పాత్ర ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. విజయవాడలో రాయితీపై కందిపప్పు, బియ్యం అందించే రైతుబజార్ తొలి కౌంటర్‌ను ఆయన ప్రారంభించారు. ‘కాకినాడలో 43,249 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేశాం. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.

Similar News

News November 18, 2025

నేడు ఇలా చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి

image

కృష్ణాంగారక చతుర్దశి ఎన్నో శుభాలను కలిగించే పవిత్రమైన రోజు. నేడు ఎర్ర పూలు/కుంకుమ కలిపిన నీటితో స్నానం చేస్తే అంగారకుడి కటాక్షం కలుగుతుందట. ఆదిత్య మంత్రం 12 సార్లు పలికితే సూర్యుడు అనుగ్రహిస్తాడని నమ్మకం. పితృ తర్పణంతో రుణ బాధలు తొలగి, సంతోషంగా ఉంటారట. గోధుమలు దానమిస్తే జాతకంలో రవి బలం బాగుంటుందట. యమ దీపం వెలిగిస్తే అప్పుల బాధలు తొలగి, కుజ దోషం పోయి సొంతింటి కల నెరవేరుతుందని పండితులు అంటున్నారు.

అమెరికాతో త్వరలోనే ట్రేడ్ డీల్!

image

ఇండియా, అమెరికా మధ్య తొలి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) త్వరలోనే ఖరారు కానుందని తెలుస్తోంది. అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘BTAపై అమెరికాతో చర్చిస్తున్నాం. ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. ఒకదానికి సమయం పడుతుంది. రెండోది రెసిప్రోకల్ టారిఫ్స్‌ను పరిష్కరించే ప్యాకేజీ. దీని విషయంలో డీల్‌కు దగ్గరగా ఉన్నాం’ అని వెల్లడించాయి.