News July 11, 2024

రేషన్ బియ్యం అక్రమ తరలింపులో IPSల పాత్ర: నాదెండ్ల

image

AP: రేషన్ బియ్యం అక్రమ తరలింపులో ఐదుగురు IPS అధికారుల పాత్ర ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. విజయవాడలో రాయితీపై కందిపప్పు, బియ్యం అందించే రైతుబజార్ తొలి కౌంటర్‌ను ఆయన ప్రారంభించారు. ‘కాకినాడలో 43,249 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేశాం. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.

Similar News

News February 19, 2025

మోనాలిసాకు బిగ్ షాక్?

image

కుంభమేళాలో వైరలయిన మోనాలిసా ‘ది డైరీ ఆఫ్ మణిపుర్’ మూవీలో నటించనున్నారు. అయితే ఈ చిత్రం ప్రారంభానికి ముందే నిలిచిపోయేలా కనిపిస్తోంది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా తాగుబోతని సినీ నిర్మాత జితేంద్ర ఆరోపించారు. ‘సినిమా అవకాశాలిస్తానని అమ్మాయిలను ముంబైకి తీసుకెళ్లి అనుచితంగా ప్రవర్తిస్తాడు. అతని ఒక్క సినిమా విడుదల కాలేదు. మోనాలిసాను వాడుకుంటున్నాడు’ అని జితేంద్ర పేర్కొన్నారు. దీనిని మిశ్రా ఖండించారు.

News February 19, 2025

తెలుగు రాష్ట్రాలకు నిధులు రిలీజ్ చేసిన కేంద్రం

image

కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాలకు విపత్తు, వరదల సాయం కింద నిధులు విడుదల చేసింది. ఏపీకి అత్యధికంగా రూ.608.08 కోట్లు, తెలంగాణకు రూ.231 కోట్లు, త్రిపురకు రూ.288.93 కోట్లు, ఒడిశాకు రూ.255.24 కోట్లు, నాగాలాండ్‌కు రూ.170.99 కోట్లు రిలీజ్ చేసింది. ఐదు రాష్ట్రాలకు కలిపి రూ.1,554.99 కోట్లు విడుదల చేశారు.

News February 19, 2025

సలామ్ DIIs: 45 రోజుల్లోనే రూ.లక్ష కోట్ల పెట్టుబడి

image

స్వదేశీ సంస్థాగత మదుపరులు (DII) భారత స్టాక్ మార్కెట్లకు ఆపద్బాంధవులుగా మారారు. FM నిర్మలా సీతారామన్ చెప్పినట్టుగానే రిటైల్ ఇన్వెస్టర్లతో కలిసి FIIల పెట్టుబడుల ఉపసంహరణను పూర్తిగా అబ్జార్బ్ చేసుకుంటున్నారు. 2025లో 45 రోజుల్లోనే రూ.1.2లక్షల కోట్లను ఈక్విటీల్లో కుమ్మరించారు. FIIలు వెనక్కి తీసుకున్న రూ.1.6 లక్షల కోట్లతో ఇది దాదాపుగా సమానం. 2024లోనూ DIIలు రూ.5.22 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడం విశేషం.

error: Content is protected !!