News September 13, 2024

చరిత్ర సృష్టించిన రొనాల్డో.. 100కోట్లకు చేరిన ఫాలోవర్ల సంఖ్య

image

పోర్చుగీస్ ఫుట్‌బాల్ సంచలనం క్రిస్టియానో రొనాల్డో సోషల్ మీడియాలో చరిత్ర సృష్టించారు. అన్ని ప్లాట్‌ఫామ్‌లలో కలిపి 100 కోట్ల మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. ‘ఇది చాలా ఎక్కువ. మీ ప్రేమకు నిదర్శనం. నా కుటుంబం, మీకోసం ఆడాను. ఇప్పుడు నాతో 1 బిలియన్ మంది ఉన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా మీరు నాతోనే ఉన్నారు. అందుకు ఎప్పటికీ కృతజ్ఞుడినై ఉంటాను. మనమంతా కలిసి చరిత్ర సృష్టిద్దాం’ అని ట్వీట్ చేశారు.

Similar News

News November 22, 2025

HNK: బావ ఇంటికి బావమరిది కన్నం

image

బావ ఇంట్లో దొంగతనం చేసిన బావమరిదిని HNK జిల్లా మడికొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వాహన తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన ఐలవేని సాయి రోహిత్‌ (26)ను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆరు నెలల కిందట బావ బూతగడ్డ సతీష్‌ ఇంట్లో దొంగతనం చేసినట్టు ఒప్పుకొన్నాడు. అతడి వద్ద నుంచి రూ. 4.36 లక్షల విలువైన 47.05 గ్రా. బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పుల్యాల కిషన్ తెలిపారు.

News November 22, 2025

‘నక్క’ బుద్ధి చూపించింది!.. భారతీయుల ఆగ్రహం

image

ఆస్ట్రేలియాకు చెందిన ఫాక్స్ క్రికెట్‌ ఛానల్‌పై క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో మ్యాచ్‌ అయితే ఒకలా, ఆస్ట్రేలియాలో అయితే మరోలా మాట్లాడుతోందని అంటున్నారు. యాషెస్‌ టెస్టులో తొలి రోజు 19 వికెట్లు పడ్డాయంటూ గొప్పగా రాసుకొచ్చింది. అయితే ఇటీవల INDvsSA టెస్టు మ్యాచ్‌లో ఒకేరోజు 15 వికెట్లు పడటంపై “RIP TEST CRICKET” అంటూ పేర్కొంది. దీంతో ‘నక్క’ బుద్ధి చూపిస్తోందని ట్రోల్ చేస్తున్నారు.

News November 22, 2025

AP న్యూస్ అప్డేట్స్

image

* విశాఖ(D) తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం 308 ఎకరాలు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నేటి నుంచి పరిహారం(ఎకరాకు రూ.20లక్షలు) అందజేయనుంది.
* రాష్ట్రంలో ఎర్రచందనం చెట్ల రక్షణకు కేంద్రం రూ.39.84 కోట్లను విడుదల చేసింది.
* అక్రమాస్తుల కేసులో APMSIDC జనరల్ మేనేజర్ మల్లాది వెంకట సూర్యకళను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆమెకు 27 చోట్ల స్థలాలు, ఇళ్లు, భూములు ఉన్నట్లు గుర్తించారు.