News May 17, 2024
విశాఖలో రౌడీయిజం బాగా పెరిగింది: విష్ణుకుమార్ రాజు
AP: వైసీపీ గూండాలకు పోలీసులు మద్దతిస్తున్నారని బీజేపీ విశాఖ నార్త్ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. కూటమికి ఓటేశారని విశాఖలో ఓ కుటుంబంపై దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. ‘కుటుంబ తగాదాల వల్లే ఈ దాడులు అనేది అబద్ధం. బాధితులకు రక్షణ కల్పించాలి. ఈ ఘటనపై CP, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం. విశాఖలో రౌడీయిజం బాగా పెరిగింది. మేం ప్రచారం చేస్తున్న సమయంలోనూ కొందరు అడ్డుకున్నారు’ అని ఫైర్ అయ్యారు.
Similar News
News January 9, 2025
ఏంటి సార్.. మీ కోసం రోజుకు 12 గంటలు పనిచేయాలా?
వారానికి 70 గంటలు వర్క్ చేయాలని నారాయణమూర్తి, 90 గంటలు పనిలో ఉండాలని సుబ్రహ్మణ్యన్(L&T ఛైర్మన్) సలహా ఇస్తున్నారు. వీరి వ్యాఖ్యలపై సగటు వేతన జీవులు ఫైరవుతున్నారు. దీనివల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా సాధ్యమని, ఆఫీసులోనే సగం రోజు గడిపేస్తే భార్య, పిల్లలకు టైమ్ కేటాయించడమెలా అని నిలదీస్తున్నారు. కంపెనీ ఎదుగుదల కోసం వారు చెప్పినట్లే 90 గంటలు వర్క్ చేసినా శాలరీ హైక్స్ మాత్రం ఉండవంటున్నారు. మీరేమంటారు?
News January 9, 2025
తొక్కిసలాట బాధితుల్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్
AP: తిరుపతి తొక్కిసలాట బాధితుల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడి నుంచి తొక్కిసలాట జరిగిన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి స్విమ్స్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు.
News January 9, 2025
తొక్కిసలాట ఘటనపై సమీక్షిస్తున్నా: సీఎం చంద్రబాబు
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘స్విమ్స్‌లో బాధితులను పరామర్శించాను. వారందరితో మాట్లాడాను. ఘటనపై సమీక్షిస్తున్నా. అసలేం జరిగిందన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఆ తర్వాత మీడియా ద్వారా పూర్తి వివరాలు ప్రజలకు తెలియచేస్తాను’ అని తెలిపారు. ఘటన విషయంలో అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.