News March 30, 2024
బీజేపీ నుంచి ‘రాయల్’గా బరిలోకి! – 1/2
ఎన్నికల బరిలో నిలవాలనుకునే రాజవంశీయులకు బీజేపీ ఓ మంచి వేదిక అయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈసారి BJP నుంచి 10 మంది లోక్‌సభ బరిలో ఉండటమే ఇందుకు కారణం. మైసూర్ రాజవంశీయుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్‌ను మైసూర్ అభ్యర్థిగా బీజేపీ ఇటీవల ప్రకటించింది. 20ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ రాయల్ ఫ్యామిలీ మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. 2004లో ఓటమి అనంతరం వీరి కుటుంబం రాజకీయాలకు దూరమైంది.
<<-se>>#Elections2024<<>>
Similar News
News January 22, 2025
భార్యతో సెల్ఫీ ఎంత పని చేసింది
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత చలపతి మృతి చెందిన విషయం తెలిసిందే. భార్యతో దిగిన సెల్ఫీనే తన మరణానికి దారితీస్తుందని ఆయన ఊహించి ఉండకపోవచ్చు. చలపతి భార్య అరుణ కూడా మావోయిస్టు పార్టీలో ఉన్నారు. 2016లో వారిద్దరూ కలిసి దిగిన సెల్ఫీ ఫోన్ పోలీసులకు చిక్కింది. దీని ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేశారు. పక్కా సమాచారంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దాడి చేయడంతో చలపతి సహా 27 మంది మావోలు చనిపోయారు.
News January 22, 2025
ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌ను కలిసిన సైఫ్
ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాను బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కలిశారు. తనను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి రక్షించినందుకు ఆయనకు సైఫ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాగే ఇతరులకు కూడా సహాయం అందించాలని ఆటోడ్రైవర్‌కు సూచించారు. సైఫ్ వెంట ఆయన తల్లి షర్మిలా ఠాగూర్ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా భజన్ సింగ్‌కు సైఫ్ రివార్డు ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి.
News January 22, 2025
పవన్‌ను ముందు పెట్టి బీజేపీ డ్రామాలు: అద్దంకి
ఏపీలోని కూటమి ప్రభుత్వంలో లుకలుకలు మొదలయ్యాయని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. ‘చంద్రబాబుతో కయ్యం తమ పార్టీ ఉనికికే ప్రమాదమని బీజేపీకి తెలుసు. అందుకే పవన్ కళ్యాణ్‌ను ముందు పెట్టి ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. మిత్ర పార్టీలతో లబ్ధి పొంది, ఆ పార్టీలను అంతం చేయడం బీజేపీకి ఉన్న అలవాటే. రాజకీయ స్వార్థమే ఆ పార్టీని పతనం వైపు నెడుతోంది’ అని విమర్శించారు.