News March 30, 2024
బీజేపీ నుంచి ‘రాయల్’గా బరిలోకి! – 2/2

రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ నుంచి మేవార్ రాజకుటుంబానికి చెందిన మహిమా కుమారీ బరిలో నిలవనున్నారు. త్రిపుర ఈస్ట్ నుంచి కృతిసింగ్ దెబ్బార్మా (మాణిక్య రాజకుటుంబం).. ఒడిశాలో మాజీ ఎంపీ ఆర్కా కేసరీ డియో (కలహండి రాజకుటుంబీకులు) సతీమణి మాళవిక పోటీ చేయనున్నారు. బెంగాల్‌లో కృష్ణానగర్ నుంచి రాజమాత అమృతా రాయ్ నిలిచారు. వీరు పోటీ చేయడం ఇదే తొలిసారి. కాగా మరికొందరు ఇప్పటికే BJPలో కొనసాగుతున్నారు.
<<-se>>#Elections2024<<>>
Similar News
News April 11, 2026
వేసవిలో అలోవెరా జ్యూస్ తాగితే..

వేసవిలో అలోవెరా జ్యూస్ తాగితే శరీరానికి చలువ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ‘ఇది శరీర వేడిని తగ్గించి హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. పరగడుపున తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది’ అని అంటున్నారు. ‘రోజుకు 50-120ml మాత్రమే తీసుకోవాలి. జెల్‌ను నీటితో కడిగి మిక్సీలో వేసి నీరు, నిమ్మరసం/తేనె కలుపుకోవాలి’ అని సూచిస్తున్నారు.
News April 11, 2026
350 బ్యాంక్ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇండియన్ బ్యాంక్ 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఐటీ, ఫైనాన్స్, మార్కెటింగ్, క్రెడిట్, రిస్క్, HRలో అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్ లాంటి ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్‌తో భర్తీ చేయనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. చివరి తేదీ ఏప్రిల్ 28. బీటెక్, MCA, MBA, CA, ఏదైనా పీజీ చేసి ఉండాలి. మరిన్ని వివరాలకు https://indianbank.bank.in/career/ చూడండి.
News April 11, 2026
ChatGPT సృష్టికర్త ఆల్ట్‌మన్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి

చాట్‌జీపీటీని క్రియేట్ చేసిన OpenAI CEO సామ్ ఆల్ట్‌మన్ ఇంటిపై పెట్రోల్ బాంబుతో దాడి జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఓ యువకుడు ఆయన నివాసంపై దాడి చేసి ఆఫీసును తగులబెడతానని బెదిరించాడు. పోలీసులు నిందితుణ్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. తన ఫ్యామిలీ సేఫ్టీపై ఆందోళన వ్యక్తం చేసిన ఆల్ట్‌మన్ AI పట్ల పెరుగుతున్న వ్యతిరేకత, తనపై వస్తున్న విమర్శలే ఈ దాడులకు కారణమని ఆవేదన వ్యక్తం చేశారు.


