News March 30, 2024

బీజేపీ నుంచి ‘రాయల్‌’గా బరిలోకి! – 2/2

image

రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ నుంచి మేవార్ రాజకుటుంబానికి చెందిన మహిమా కుమారీ బరిలో నిలవనున్నారు. త్రిపుర ఈస్ట్ నుంచి కృతిసింగ్ దెబ్బార్మా (మాణిక్య రాజకుటుంబం).. ఒడిశాలో మాజీ ఎంపీ ఆర్కా కేసరీ డియో (కలహండి రాజకుటుంబీకులు) సతీమణి మాళవిక పోటీ చేయనున్నారు. బెంగాల్‌లో కృష్ణానగర్ నుంచి రాజమాత అమృతా రాయ్ నిలిచారు. వీరు పోటీ చేయడం ఇదే తొలిసారి. కాగా మరికొందరు ఇప్పటికే BJPలో కొనసాగుతున్నారు.
<<-se>>#Elections2024<<>>

Similar News

News January 17, 2025

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

image

జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్రం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 13 వరకు సమావేశాలు కొనసాగుతాయి. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు.

News January 17, 2025

అలాంటి ఇళ్ల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్

image

AP: ఆక్రమణలకు గురైన అభ్యంతరంలేని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న పేదల ఇళ్లను క్రమబద్ధీకరించనున్నట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. వీరు 15-10-2019 నాటికి దరఖాస్తు చేసుకుని ఉండాలని తెలిపారు. అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన లేఅవుట్లలో పలు కారణాలతో ఇళ్లు నిర్మించుకోని వారి పట్టాలను రద్దు చేస్తున్నామన్నారు. అలాంటి వారికి కోరుకున్న చోట ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పారు.

News January 17, 2025

దేశం గర్వించేలా మరింత కష్టపడతా: మనూ భాకర్

image

ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు అందుకోవడంపై ఒలింపిక్ మెడలిస్ట్, భారత షూటర్ మనూ భాకర్ స్పందించారు. ‘గౌరవ రాష్ట్రపతి నుంచి ఖేల్ రత్న అవార్డు అందుకోవడం ఎంతో గర్వంగా భావిస్తున్నా. ఈ గుర్తింపు నా దేశం గర్వపడేలా చేసేందుకు మరింత కష్టపడి పనిచేయడానికి, విజయాలు పొందేందుకు స్ఫూర్తినిస్తోంది. నాకు మద్దతునిచ్చిన, ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.