News April 21, 2024

రేపు ఉండిలో RRR నామినేషన్

image

AP: ఉండి నియోజకవర్గ TDP MLA అభ్యర్థిగా రఘురామకృష్ణ రాజు రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉండి MRO ఆఫీసులో రేపు ఉ.10.30 గంటలకు తాను నామినేషన్ వేస్తానని RRR ట్వీట్ చేశారు. ఇందుకోసం పెదఅమిరంలోని స్వగృహం నుంచి భారీ ర్యాలీగా MRO ఆఫీసుకు బయల్దేరనున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొనాలని RRR కోరారు. కాగా తొలుత ఉండి టికెట్ సిట్టింగ్ MLA రామరాజుకు కేటాయించిన CBN.. చివరకు RRRకు ఫైనల్ చేశారు.

Similar News

News January 27, 2026

రామకృష్ణ తీర్థం ఎక్కడ, ఎలా ఉంటుందంటే..

image

రామకృష్ణ తీర్థం తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 10km దూరంలో ఉంటుంది. దట్టమైన శేషాచల అడవుల మధ్య ఉండే ఈ తీర్థాన్ని పవిత్రంగా కొలుస్తారు. యాత్రికులు ముందుగా తిరుమల నుంచి బస్సు/సొంత వాహనాల్లో పాపవినాశనం చేరుకుంటారు. అక్కడి నుంచి సుమారు 6KM దూరంలో ఈ తీర్థం ఉంటుంది. రాళ్లు, రప్పలు, నీటి వాగుల గుండా ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తే ఈ పవిత్ర తీర్థం వస్తుంది. ఇది ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా, అతి రమణీయంగా ఉంటుంది.

News January 27, 2026

నేడు బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

image

వారానికి 5 రోజుల పని అమలుకు డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు నేడు సమ్మెకు దిగనున్నారు. ఇటీవల చీఫ్ లేబర్ కమిషనర్‌తో జరిగిన చర్చలు విఫలమవడంతో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో SBI, PNB, BOB, యూనియన్ తదితర బ్యాంకుల సేవల్లో ఈరోజు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఈ యూనియన్లలో లేని HDFC, ICICI, యాక్సిస్ వంటి బ్యాంకుల సేవలు యథాతథంగా కొనసాగనున్నాయి.

News January 27, 2026

‘జననాయగన్’ సెన్సార్ వివాదంపై నేడు తీర్పు

image

తమిళ హీరో, TVK అధినేత విజయ్ నటించిన చివరి సినిమా ‘జననాయగన్’ (తెలుగులో జన నాయకుడు) సెన్సార్ కేసులో నేడు తీర్పు వెలువడనుంది. సెన్సార్ <<18907956>>వివాదంపై<<>> మద్రాస్ హైకోర్టు ఇటీవల తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. అనుకూలంగా తీర్పు వస్తే ఫిబ్రవరి 6న మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. హెచ్.వినోద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు నటించారు.