News November 13, 2024
నామినేషన్ దాఖలు చేసిన RRR

AP అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి ఉండి MLA కనుమూరు రఘురామకృష్ణరాజు నామినేషన్ దాఖలు చేశారు. NDA కూటమికి చెందిన పార్టీల నేతలు ఆయన తరఫున అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్కు నామినేషన్ పత్రాలు అందించారు. ఈ పదవికి ఇంకెవరు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఉప సభాపతి పదవికి RRR ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశం ఉంది.
Similar News
News November 22, 2025
ONGCలో 2,623 పోస్టులు.. అప్లై చేశారా?

ఆయిల్ & నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC)లో 2,623 అప్రెంటీస్ పోస్టులకు అప్లై చేయడానికి NOV 25 ఆఖరు తేదీ. ఈ నెల 17వరకు NATS పోర్టల్లో రిజిస్ట్రర్ చేసుకున్నవారు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ పాసైన వారు అర్హులు. వయసు 18-24 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ను బట్టి సడలింపు ఉంటుంది. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. వెబ్సైట్: ongcindia.com/
News November 22, 2025
వంటింటి చిట్కాలు

– చపాతీ పిండి మిగిలిపోతే దానిపై కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి, గాలి వెళ్లని డబ్బాలో పెట్టి ఫ్రిజ్లో ఉంచాలి.
– ఫ్రిజ్లో అక్కడక్కడ కొద్దిగా పుదీనా ఆకులు ఉంచితే దుర్వాసన రాదు.
– కూరల్లో కారం ఎక్కువైతే అందులో టేబుల్ స్పూన్ నిమ్మరసం లేదా నెయ్యి వేస్తే కారం తగ్గుతుంది.
– కాఫీ టేస్టీగా రావాలంటే డికాషన్లో చిటికెడు ఉప్పు వేయాలి.
– ఆపిల్ పండ్ల పక్కనే పెడితే అరటి పండ్లు త్వరగా పండుతాయి.
News November 22, 2025
వనజీవి జీవితంపై సినిమా మొదలు!

తెలంగాణ ‘వనజీవి’గా పేరుగాంచిన పద్మశ్రీ అవార్డు గ్రహీత రామయ్య జీవిత చరిత్ర సినిమా రూపంలో తెరకెక్కనుంది. ఖమ్మంలో ఈ బయోపిక్ను లాంఛనంగా ప్రారంభించారు. వనజీవి రామయ్య తన జీవితాన్ని లక్షలాది మొక్కలను నాటడానికి, రక్షించడానికి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆదర్శవంతమైన, నిరాడంబర జీవన విధానం, పర్యావరణ భక్తిని ఈ సినిమా వెండితెరపైకి తీసుకురానుంది. ఆయన పాత్రలో నటుడు బ్రహ్మాజీ కనిపించనున్నారు.


