News January 31, 2025
మొగిలిగిద్ద ZPHSకు రూ.10 కోట్లు మంజూరు

TG: RR(D) ఫరూక్‌నగర్(మ) మొగిలిగిద్ద ZPHS స్కూలు 150వ వార్షికోత్సవంలో పాల్గొన్న CM రేవంత్ రెడ్డి పాఠశాలపై వరాల జల్లు కురిపించారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేశారు. పాఠశాల నూతన భవనం, గ్రంథాలయ భవన నిర్మాణాలకు రూ.10 కోట్లు, గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణాల కోసం రూ.5 కోట్లు, పంచాయతీ కార్యాలయం కోసం రూ.50లక్షలు, జూనియర్ కాలేజీలో మౌలిక సదుపాయాలకు రూ.50లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు.
Similar News
News February 9, 2025
వచ్చే ఎన్నికల్లో బెంగాల్‌లో మాదే అధికారం: ధర్మేంద్ర ప్రధాన్

పశ్చిమ బెంగాల్‌లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ధీమా వ్యక్తం చేశారు. 2019 నుంచి ఆ రాష్ట్రంలో బీజేపీకి ఓటింగ్ 30-40 శాతంగా ఉంటోందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు మరో 10శాతం ఓట్లు అవసరమని చెప్పారు. మరోవైపు బెంగాల్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు సీఎం మమతా బెనర్జీ అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
News February 9, 2025
గ్రేట్.. చనిపోతూ ఐదుగురికి ప్రాణం పోసిన డాక్టరమ్మ

HYD నార్సింగిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డా.భూమిక (కర్నూలు) చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్ అయ్యారు. దీంతో జీవన్‌దాన్, అవయవ దానం కోసం వారి కుటుంబసభ్యులను సంప్రదించగా.. తీవ్రమైన దుఃఖంలోనూ వారు అంగీకరించారు. దీంతో భూమిక గుండె, లివర్, రెండు కిడ్నీలు, ఊపిరితిత్తులను ఇతర వ్యక్తులకు అమర్చారు. మరణంలోనూ డాక్టరమ్మ తన వృత్తిధర్మాన్ని నిర్వర్తించారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
News February 9, 2025
కాంగ్రెస్, BRS మధ్య ఒప్పందం: బండి సంజయ్

TG: కాంగ్రెస్, BRSవి కాంప్రమైజ్ పాలిటిక్స్ అని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ-రేస్ కేసుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తమ నేతలను అరెస్టు చేయకుండా ఉండేందుకు BRS ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉందన్నారు. ఎంఐఎం ఒత్తిడితోనే ముస్లింలను బీసీల్లో కలిపారని, బీసీ సంఘాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.